Advertisementt

ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌..!

Sun 07th Jun 2015 05:31 AM
trivikram sreenivas,ntr,pawan kalyan,mahesh babu  ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌..!
ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌..!
Advertisement
Ads by CJ
ఎంతోకాలంగా ఎన్టీఆర్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం వస్తే బాగుంటుందని ఎన్టీఆర్‌తో సహా అందరూ భావిస్తూ వస్తున్నారు. కాగా ఈ కాంబినేషన్‌ పట్టాలెక్కనుందని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమాకు స్క్రిప్ట్‌ పనిలో త్రివిక్రమ్‌ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఆయన పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబులతో చేయాల్సిన చిత్రాలు ఇప్పుడే మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. పవన్‌ ప్రస్తుతం ‘గబ్బర్‌సింగ్‌2’తో ఆతర్వాత డాలీ దర్శకత్వంలో దాసరి చిత్రంలో నటించనున్నాడు. ఇక మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివతో ‘శ్రీమంతుడు’, ఆ తర్వాత శ్రీకాంత్‌ అడ్డాలతో ‘బ్రహ్మోత్సవం’ చిత్రాలు చేయనున్నాడు. దీంతో త్రివిక్రమ్‌ ఎన్టీఆర్‌తో సినిమాకు ప్లాన్‌ చేస్తున్నాడట. ఎన్టీఆర్‌ త్వరలో సుకుమార్‌ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌`త్రివిక్రమ్‌ సినిమా మొదలవుతుందని, ఈ చిత్రాన్ని సితార మూవీస్‌ అనే నూతన నిర్మాణసంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. మరి త్రివిక్రమ్‌ పంచ్‌లను ఎన్టీఆర్‌ నోట వింటే ఇక అందరికీ పండుగే అని చెప్పాలి. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ