Advertisementt

రోజు రోజుకు ‘బాహుబలి’ రేంజ్‌ పెరుగుతోంది..!

Sun 07th Jun 2015 05:26 AM
bahubali,karanjohar,rajamouli,prabhas,rana  రోజు రోజుకు ‘బాహుబలి’ రేంజ్‌ పెరుగుతోంది..!
రోజు రోజుకు ‘బాహుబలి’ రేంజ్‌ పెరుగుతోంది..!
Advertisement
Ads by CJ

దేశంలో ‘బాహుబలి’ ఫీవర్‌ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ చిత్రం భారతీయ చిత్రం స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయి సినిమా రేంజ్‌కు పెరిగింది. దీనికి ఓ విధంగా కరణ్‌జోహార్‌ కృషే కారణమని చెప్పవచ్చు. హిందీ ట్రైలర్‌ విడుదలైన తొలిరోజులోనే ఈ చిత్రం 10లక్షల హిట్స్‌ను సొంతం చేసుకొంది. ఉత్తరాధి ప్రేక్షకులు ‘బాహుబలి’ ట్రైలర్‌కు నీరాజనాలు పలుకుతున్నారు. విడుదలకు ఇంకా నెలరోజులు ఉండగానే ఈ చిత్రం ప్రమోషన్‌ పీక్‌ స్టేజీకి చేరింది. ఇండియాలోనే రాజమౌళి టాప్‌ అంటూ కరణ్‌జోహార్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో రాజమౌళిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. రాజమౌళి విజన్‌ను ఆయన తెగ పొగిడేస్తున్నాడు. బాలీవుడ్‌లో రాజమౌళిపై మేకింగ్‌ వీడియో విడుదల చేశాడు. అంతేగాకుండా ప్రమోషన్‌లో ప్రభాస్‌కు పెద్దపీట వేయకుండా బాలీవుడ్‌ ప్రేక్షకులకు చిరపరిచితమైన రానాను ఎక్కువగా ఫోకస్‌ పెడుతున్నాడు. మరి ఈ చిత్రం దేశవిదేశాలలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచిచూడాల్సివుంది..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ