Advertisementt

సూర్య భలే స్కెచ్‌ వేస్తున్నాడు!

Tue 05th May 2015 06:25 AM
suriya,tollywood old movie titles,mass movie,rakshasudu movie title  సూర్య భలే స్కెచ్‌ వేస్తున్నాడు!
సూర్య భలే స్కెచ్‌ వేస్తున్నాడు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో పాత సినిమాల టైటిళ్లకు ఉన్న గిరాకీ అంతా ఇంతా కాదు. టైటిల్‌ క్రేజ్‌ను వాడుకోవాలని చూసేవాళ్లు చాలామంది ఉన్నారు. దానికి తోడు చిరంజీవి హిట్‌ సినిమాల టైటిళ్లకు మరింత క్రేజ్‌ ఉంటుంది. ఆయన సినిమా టైటిళ్లను ఎవరు పడితే వారు వాడేసుకుంటుంటారు. తాజాగా ఈ జాబితాలో తమిళ స్టార్‌ సూర్య కూడా చేరాడు. సూర్య నటించిన తమిళ చిత్రం ‘మాస్‌’ విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని ఒకేసారి తమిళ, తెలుగు  భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకుడు. అయితే తెలుగులో నాగార్జున నటించిన ‘ మాస్‌’ చిత్రం వచ్చి ఇంకా ప్రేక్షకులకు బాగానే గుర్తింది. దాంతో తమ చిత్రానికి తెలుగు వెర్షన్‌ టైటిల్‌ ఏది పెట్టాలా? అనే ఆలోచనలో యూనిట్‌ ఉంది. తాజా సమాచారం ప్రకారం వారి దృష్టి చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ టైటిల్‌పై పడింది. ‘రాక్షసుడు’ అయితే తమ చిత్రానికి పర్‌ఫెక్ట్‌గా యాప్ట్‌ అవుతుందని భావిస్తున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ