Advertisementt

‘జిల్‌’ హీరోయిన్‌కు మంచి ఆఫర్‌!

Tue 05th May 2015 06:28 AM
hero ram,pandaga chesko movie,shivam,harikadha movie,rashi khanna  ‘జిల్‌’ హీరోయిన్‌కు మంచి ఆఫర్‌!
‘జిల్‌’ హీరోయిన్‌కు మంచి ఆఫర్‌!
Advertisement
Ads by CJ

గత కొంతకాలంగా సరైన హిట్‌ లేని హీరో రామ్‌... ఎలాగైనా హిట్టు కొట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఆ కోవలో ఇప్పటికే ‘పండగచేస్కో’ సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్దం చేశాడు. అదే విధంగా మరో రెండు సినిమాలు ‘శివం, హరికథ’ లను ఇప్పటికే సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ‘శివం’ షూటింగ్‌ ఈమధ్యే రెండో షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా శ్రీనివాసరెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్‌ పతాకంపై స్రవంతి రవికిషోర్‌ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్‌ సరసన నటించే హీరోయిన్‌ను ఖరారు చేశారని సమాచారం. ‘జిల్‌’ సినిమాతో ఇటు నటనలోనూ అటు గ్లామర్‌పరంగానూ అందరినీ ఆకట్టుకున్న రాశిఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. మొత్తానికి రామ్‌కి జోడిగా రాశిఖన్నా చూడముచ్చనైన జంటగా ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ