Advertisementt

తెలుగు హీరోను పొట్టనపెట్టుకున్న భూకంపం..!!

Mon 27th Apr 2015 05:28 AM
vetakaram,vijay,dead,nepal earth quake  తెలుగు హీరోను పొట్టనపెట్టుకున్న భూకంపం..!!
తెలుగు హీరోను పొట్టనపెట్టుకున్న భూకంపం..!!
Advertisement
Ads by CJ

నేపాల్‌లో వచ్చిన భూకంపంలో ఓ తెలుగు హీరో మృతిచెందారు. 'వెటకారం' షూటింగ్‌ కోసం నేపాల్‌ వెళ్లిన ఆ సినిమా యూనిట్‌ భూకంపం తర్వాత కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే వారు సేఫ్‌గానే ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో సినీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం నేపాల్‌ భూకంపంలో 'వెటకారం' సినిమాలో హీరోగా చేస్తున్న విజయ్‌ మృతిచెందినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అతడు కారులో ప్రయాణిస్తుండగా భూకంపం వచ్చి.. కారు పల్టీ కొట్టిందని, దీంతో తీవ్రంగా గాయపడ్డ అతడు మృతిచెందినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా యూనిట్‌కు సంబంధించి మరికొంత మంది కూడా మిస్సింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం రావాల్సి ఉంది. నేపాల్‌లో వచ్చిన భూకంపం ఆ దేశంతోపాటు తెలుగు సినీ అభిమానుల్లోనూ విషాదం నింపింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ