Advertisementt

యంగ్‌ హీరోతో సమంత!

Fri 24th Apr 2015 05:12 AM
samantha,sundeep kishan new movie,vv vinayak,chota k naidu,samantha with sundeep kishan  యంగ్‌ హీరోతో సమంత!
యంగ్‌ హీరోతో సమంత!
Advertisement
Ads by CJ

సమంత ఆమధ్య ‘అల్లుడు శీను’ చిత్రంలో కొత్త హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సరసన నటించి అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించడం, బెల్లకొండ సురేష్‌ కొడుకు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం కావడంతో భారీ రెమ్యూనరేషన్‌ తీసుకొని కొత్త హీరో అయినా ఓకే చెప్పేసింది. సమంత మరలా అలాంటి నిర్ణయమే మరోటి తీసుకుందని ఫిల్మ్‌నగర్‌లో వినపడుతోంది. యంగ్‌హీరో సందీప్‌కిషన్‌ సరసన ఆమె ఓ చిత్రంలో హీరోయిన్‌గా నటించనుందని, ఈ చిత్రానికి కూడా వినాయక్‌ దర్శకత్వం వహించే అవకాశం ఉందని సమాచారం. సందీప్‌కిషన్‌ మామ చోటా కె నాయుడు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలో ఉందని, త్వరలో పూర్తి వివరాలు బయటకు వస్తాయని అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ