బికినీ బ్యూటీకి తమిళ తంబిలు ఫిదా..!

CineJosh news
తమిళ తంబిలకు బొద్దుగా ఉన్న హీరోయిన్లు అంటేనే ఇష్టం. పలువురు హీరోయిన్లు తమిళంలో అవకాశాల కోసం బరువు పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఒకప్పటి మాట. ఇకపై, వారు తమ అభిప్రాయాలను మార్చుకోక తప్పదేమో. మోస్ట్ డిజైరబుల్ విమెన్ అఫ్ 2014, చెన్నై కిరీటాన్ని సెక్సీ సెరైన్, బికినీ బ్యూటీ అమీ జాక్సన్ సొంతం చేసుకుంది. తమిళ తంబిలు ఈ సైజ్ జీరో ఫారిన్ అమ్మడు అందాలకు ఫిదా అయిపోయారు. టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో అమీ జాక్సన్ అత్యధిక ఓట్లను సొంతం చేసుకుంది. 'ఐ' సినిమాలో అమీ జాక్సన్ పెర్ఫార్మన్స్, మిగతా సినిమాల్లో ఆమె నటన, అందాల ప్రదర్శన తమిళ తంబిలకు బాగా నచ్చాయి. 

శృతి హాసన్, సమంత, తమన్నాలు అమీ జాక్సన్ తర్వాత స్థానాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ.. క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతున్న నయనతార, హన్సికలు టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. త్రిష, కాజల్ అగర్వాల్ 11, 12 స్థానాలతో సరిపెట్టుకోవడం గమనార్హం. బొద్దుగా ఉంటేనే తమిళ ప్రేక్షకులు ఆదరిస్తారనే అభిప్రాయాన్ని మార్చుకుంటారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.    
amy jackson
bikini beauty
nayanathara
hansika