శ్రుతిని ఏడిపించిన మినిస్టర్..!

'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టి 'గబ్బర్ సింగ్' , 'ఎవడు' , 'రేసుగుర్రం' వంటి హిట్ సినిమాలలో నటించి స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రుతిహాసన్. ఈ మధ్యకాలంలో శ్రుతిపై రోజుకో వార్త వస్తూనే ఉంది. నిన్నటివరకు పి.వి.పి సంస్థ నిర్మించే సినిమాలో నటించడం కుదరదని వార్తల్లోకెక్కింది. అయితే పి.వి.పి వారు కోర్టుకు వెళ్ళేసరికి శ్రుతి దిగొచ్చి నటించడానికి అంగీకరించింది. ఆ వార్త మరువక ముందే మరో సంఘటనతో శ్రుతి మళ్ళీ వార్తల్లోకొచ్చింది.

అసలు విషయం ఏమిటంటే రీసెంట్ గా శ్రుతి హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో ప్రయాణమైంది. శ్రుతి పక్క సీట్లో ఓ ఏ.పి.మినిస్టర్ కూర్చున్నారు. ఆయన విమానాశ్రయానికి వచ్చిన దగ్గరనుంచి ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. శ్రుతి పక్కన కూర్చొని కూడా పక్కన ఎవరు లేనట్లుగా బిగ్గరగా మాట్లాడడం మొదలు పెట్టాడు. దీంతో విసుగు చెందిన శ్రుతి ఆయనకి చెప్పడానికి ప్రయత్నించింది. అందుకు ఆయన నాకు చెప్పడానికి నువ్వెవరు అని శ్రుతిని ఇష్టం వచ్చినట్లు తిట్టేసాడట. దాంతో శ్రుతి కన్నీటి పర్యంతమైందని టాక్. 

sruthihasan
ap minister
hyderabad
thirupathi journey
Advertisement
Advertisement