Advertisementt

తెలుగు సినిమాపై ఆరాతీసిన బాలీవుడ్ నటి!

Fri 20th Mar 2015 04:46 AM
vidya balan,where is vidya balan,sridevi,madhuri dixit  తెలుగు సినిమాపై ఆరాతీసిన బాలీవుడ్ నటి!
తెలుగు సినిమాపై ఆరాతీసిన బాలీవుడ్ నటి!
Advertisement
Ads by CJ

ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ కలిగిన తారల పేర్లను సినిమా టైటిల్స్‌గా వాడుకోవడం సినీరంగంలో పరిపాటిగా మారింది. బాలీవుడ్‌లో ‘మై మాధురిదీక్షిత్ బన్‌నా చాహ్‌తీహూ’ పేరుతో ఓ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. రామ్‌గోపాల్‌వర్మ తెలుగులో ‘శ్రీదేవి’ పేరుతో ఓ సినిమాకు సన్నాహాలు చేశారు. ఇదిలావుండగా తెలుగులో ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ పేరుతో త్వరలో ఓ చిత్రం రాబోతుంది. ఇందులో ప్రిన్స్ కథానాయకుడి నటించారు. అనుమతి లేకుండా తమ పేరును ఉపయోగించుకోవడం పట్ల గతంలో అనేక మంది నటీనటులు అభ్యంతరం తెలిపిన ఉదంతాలున్నాయి. అయితే బాలీవుడ్ నటి విద్యాబాలన్ అందుకు భిన్నంగా స్పందించింది. తన పేరుతో తెలుగు సినిమా తీస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోనని చెప్పింది. సినిమా సబ్జెక్ట్ ఏమిటో కూడా తనకు తెలియదని.. ఇవన్నీ లైట్‌గా తీసుకోవాల్సిన విషయాలని పేర్కొంది. అయితే సినిమా కథకు, విద్యాబాలన్‌కు ఏమాత్రం సంబంధం లేదని.పేక్షకుల్లో విద్యాబాలన్‌కున్న క్రేజ్ దృష్ట్యా ఆమెపేరుని టైటిల్‌లో పెట్టుకున్నామని, ఆమె ఇమేజ్‌కు భంగం కలిగించే అంశాలు తమ చిత్రంలో వుండవని ‘వేర్ ఈజ్ విద్యాబాలన్’ చిత్రబృందం వెల్లడించింది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ