Advertisementt

తేజ మరో ప్రయోగం..!

Sat 24th Jan 2015 09:54 AM
chithram movie,teja,uday kiran,navdeep,mahesh babu nijam  తేజ మరో ప్రయోగం..!
తేజ మరో ప్రయోగం..!
Advertisement
Ads by CJ

'చిత్రం' సినిమాతో దర్శకునిగా పరిచయమై ఆ తర్వాత కొత్తవారిని ఎక్కువగా పరిచయం చేస్తూ వరుస చిత్రాలతో ముఖ్యంగా లవ్ స్టోరీస్ తో లో బడ్జెట్ లో సినిమాలు తీసి ఘన విజయాలు నమోదు చేసుకున్న దర్శకుడు తేజ. అయితే ఇటీవల కాలంలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేక డీలాపడిపోయిన ఆయన త్వరలో మరల అంతా కొత్తవారితో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో చిన్న సినిమాల నిర్మాత డి. ఎస్. రావును విలన్ గా పరిచయం చేయనున్నాడని తెలుస్తోంది. ఉదయ కిరణ్, నితిన్, నవదీప్ వంటి హీరోలను పరిచయం చేసి, మహేష్ బాబు తో నంది అవార్డ్ మూవీ 'నిజం'  గోపీచంద్ ను విలన్ గా పరిచయం చేస్తూ చిత్రాలను తీసిన తేజ ఈ చిత్రంలో మరలా  టాలీవుడ్ లో సంచలనం సృష్టించాలని భావిస్తున్నాడు. మరి తేజ మ్యాజిక్ ఇప్పటి యువతరాన్ని ఆకట్టుకోగలదో లేదో వేచిచూడాలి...!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ