Advertisementt

మహాశివరాత్రిన ముహూర్తం..!

Sat 24th Jan 2015 09:43 AM
mahesh babu,prabhas,sivarathri,muhurtham  మహాశివరాత్రిన ముహూర్తం..!
మహాశివరాత్రిన ముహూర్తం..!
Advertisement
Ads by CJ

రాబోయే మహాశివరాత్రి నాడు టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు,  ప్రభాస్ లు తమ అభిమానుల చేత జాతర చేయించనున్నారు. దీంతో ఈ ఇద్దరు హీరోల అభిమానులకు శివరాత్రి నాడు జాగరణ తప్పదు అనిపిస్తోంది. మహేష్ బాబు హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా  కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఫస్ట్ లుక్ ఫిబ్రవరి 17 తెల్లవారు జామున విదుదల కానుంది. అయితే టైటిల్ ను కూడా ఈ లోపే కన్ ఫర్మ్ చేసి ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తారా? లేక మాములుగా విడుదల చేస్తారా? అనే ఆసక్తి  నెలకొని ఉంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి తొలి టీజర్ ను కూడా అదే ముహూర్తంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు హీరోల అభిమానులు శివరాత్రి కోసం ఇప్పటినుండే ఎదురుచూపులు చూస్తున్నారు...! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ