Advertisementt

అల్లరోడికి సాయం చేసిన ఎన్టీఆర్..!

Sun 25th Jan 2015 04:51 AM
bandipotu,allari naresh,puri jagannath,junior ntr temper  అల్లరోడికి సాయం చేసిన ఎన్టీఆర్..!
అల్లరోడికి సాయం చేసిన ఎన్టీఆర్..!
Advertisement
Ads by CJ

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీజగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'టెంపర్' చిత్రం ముందుగా సంక్రాంతి కానుకగా రావలనుకుంది. కానీ చిత్రం వాయిదా పడటంతో శంకర్ 'ఐ'కి మార్గం సుగుమం అయింది. తాజాగా 'టెంపర్' ను ఫిబ్రవరి 5న విడుదల చేయాలని భావించారు. దీంతో  సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న అల్లరినరేష్ 'బందిపోటు' ను ఎప్పుడు రిలీజ్ చేయాలా?  అనే టెన్షన్ పట్టుకుంది. ఎట్టకేలకు 'టెంపర్' చిత్రం ఫిబ్రవరి 13కి వాయిదా పడింది. దీంతో ఊపిరిపీల్చుకున్న 'బందిపోటు' టీమ్ ఆగమేఘాల మీద ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటోంది. 'బందిపోటు'ను అల్లరినరేష్ చాలా సీరియస్ గా తీసుకొన్నాడు. అందులోను ఈ చిత్రం తమ సొంత బేనర్ లో రూపొందుతుండటంతో మరింత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ఈ.వి.వి. సంస్థ  యూనిట్ తీసుకుంటోంది. మరి అంది వచ్చిన ఈ అవకాశాన్ని అల్లరోడు సద్వినియోగం చేసుకుంటాడో లేదో వేచి చూడాల్సివుంది...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ