ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Mithun Chakraborty's Surprising Request to Rajini

రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి క్రేజీ కండిషన్!

Mithun Chakraborty's Surprising Request to RajiniMithun Chakraborty's Surprising Request to Rajini

 

సూపర్‌స్టార్ రజనీకాంత్ క‌థానాయ‌కుడిగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ బ్లాక్‌బస్టర్ సీక్వెల్ `జైలర్ 2` కోసం ప్రేక్షకులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. `జైలర్` కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో న‌టిస్తున్నారు. అయితే ఆయ‌న‌ ఈ సినిమా అంగీకరించే ముందు పెట్టిన ఓ  వింత కండిషన్  సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

తొలుత ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం యూనిట్ మిథున్ చక్రవర్తిని సంప్రదించగా.. ఆయన మొదట సున్నితంగా తిరస్కరించారట. `నేను రజనీకాంత్ సినిమాలో విలనా? ఆయన చేతిలో దెబ్బలు తినాలా? నా వల్ల కాదు బాబోయ్" అంటూ సరదాగా అన్నట్లు రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు.

అటుపై  కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వేవ్స్ సమ్మిట్ కార్యక్రమంలో రజనీకాంత్, మిథున్ చక్రవర్తులు కలుసుకున్నప్పుడు ఈ సినిమాపై మళ్లీ చర్చ వచ్చింది. రజనీకాంత్ అడిగితే తాను ఈ చిత్రంలో నటించేందుకు సిద్ధమేనని చెప్పిన మిథున్.. తనను హీరో కొట్టకూడదని, అలాగే తుపాకీతో కాల్చకూడదనే ఒకే ఒక్క కండిషన్ పెట్టారట. అలా కండీష‌న్ల ప్ర‌కారం మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ప్రాజెక్ట్ లో కి వ‌చ్చారు.

Mithun Chakraborty's Condition Before Signing Jailer 2