అనుష్క ఇకపై కనిపించదా?

Is Anushka Shetty Done With MoviesIs Anushka Shetty Done With Movies


ఘాటీ తర్వాత మాయమైన అనుష్క ఇప్పటివరకు పబ్లిక్ కి దర్శనమియ్యలేదు. అటు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకుంది. ఆతర్వాత  ఎక్కడా అనుష్క కనిపించలేదు. అసలు అనుష్క మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అనే చర్చ నడుస్తుంది. ఘాటి చిత్రంలో ఆమె లుక్స్ పై తీవ్రమైన విమర్శలొచ్చాయి.

సినిమా ప్రమోషన్స్ లో కనిపించదు, వినిపిస్తుంది. అసలు ఘాటీ విమర్శలతో అనుష్క చాలా రోజులుగా సైలెంట్ అయిపోయింది. దానితో ఆమె ఇకపై నటనను కొనసాగిస్తుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఈ మధ్యన అనుష్క, ప్రభాస్ స్పిరిట్ సెట్ కి వచ్చి ప్రభాస్ ని కలిసింది అనే రూమర్స్ వినిపించాయి.

అప్పుడప్పుడు అనుష్క-ప్రభాస్ పెళ్లిపై గాసిప్స్ వినిపించేవి కానీ.. ఈమధ్యన ఆ రూమర్స్ కూడా లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశలోకి నెడుతున్నాయి.. మరోపక్క సోషల్ మీడియాలో అనుష్క శెట్టి ఇకపై కనిపించదనే ఊహాగానాలు మొదలయ్యాయి. చూద్దాం అనుష్క కమ్ బ్యాక్ ఉంటుందా, లేదా అనేది. 

Anushka Shetty Slowly Stepping Away From Cinema