ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas Next with TRS Makers: Who Will Direct the Film?

2028 లో డార్లింగ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

Prabhas Next with TRS Makers: Who Will Direct the Film?Prabhas Next with TRS Makers: Who Will Direct the Film?

 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో  నిర్మాణ‌మైన‌ `ది రాజా సాబ్` సినిమా తర్వాత అదే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో ప్రభాస్ మరో సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని  నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్వయంగా వెల్లడించారు.

`గరివిడి లక్ష్మి` చిత్ర ప్రమోషన్లలో భాగంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ కీలక విషయాన్ని బయటపెట్టారు. తమ నిర్మాణ సంస్థలో ప్రభాస్‌తో మరో సినిమా ఖచ్చితంగా ఉంటుందని.. ఈ ప్రాజెక్ట్ 2028లో ప్రారంభం కానుందని  స్పష్టం చేశారు. `ది రాజా సాబ్` చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సాధించలేకపోవడంతో ప్రొడక్షన్ హౌస్‌కు మద్దతుగా నిలిచేందుకు ప్రభాస్ కొత్త సినిమాకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే  ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. 2028లో పట్టాలెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. మ‌రి డార్లింగ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ని తీసుకుంటార‌నా?  కొత్త ద‌ర్శ‌కుడితో ముందుకెళ్తారా? అన్న‌ది చూడాలి. 

Prabhas Next Film with TRS Makers: Director Details Awaited