Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Salman Shorted remuneration for vamsi paidipalli

పైడిప‌ల్లి కోసం 50కోట్లు త‌గ్గించిన స‌ల్మాన్!

Salman Shorted remuneration for vamsi paidipalli

 

 

తెలుగు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న SVC63 చిత్రం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం దాదాపు 50 కోట్లు తగ్గించుకుని 70 కోట్ల పారితోషికానికి అంగీకరించడం సినీ వర్గాలకు షాకింగ్ గా ఉంది. ఆర్థిక ప్రయోజనాల కంటే తన ఆప్తమిత్రుడు, ఈ చిత్ర సహ నిర్మాత రఫీ కాజీపై ఉన్న ప్రేమాభిమానాలు, సుదీర్ఘ అనుబంధం కోసమే భాయిజాన్ ఈ అరుదైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సాధారణంగా సినిమాల లాభాల్లో వాటా (ప్రాఫిట్ షేరింగ్) లేదా డిజిటల్, శాటిలైట్ హక్కుల భాగస్వామ్యాన్ని ఎంచుకునే సల్మాన్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ విషయంలో అటువంటి ఒప్పందాలు చేసుకున్నారో లేదో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయినా భాయిజాన్ స్నేహానికి ఇచ్చే విలువ చాలా గొప్ప‌ది. అందుకే తాజా నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. ఒకవైపు ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్తుండగానే.. మరోవైపు అపూర్వ లఖియా దర్శకత్వంలో సల్మాన్ నటించిన `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది.

Salman remuneration for vamsi paidipalli film