Advertisementt

ఆ హీరో చెంప‌లు బొబ్బ‌లెక్కేలా కొట్టిందా

Wed 29th Apr 2026 09:52 AM
actress slapped star hero  ఆ హీరో చెంప‌లు బొబ్బ‌లెక్కేలా కొట్టిందా
Actress Slapped Star Hero for 23 times for single take ఆ హీరో చెంప‌లు బొబ్బ‌లెక్కేలా కొట్టిందా
Advertisement
Ads by CJ

వెండితెరపై ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించిన ఒక అగ్ర నటుడు - సీనియర్ నటి మధ్య ఉన్న స్నేహం పరిశ్రమలో  ఆదర్శంగా నిలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో జరిగిన ఓ  ఆసక్తికరమైన సంఘటనను సదరు నటి గుర్తు చేసుకున్నారు. ఒక చిత్ర షూటింగ్ సమయంలో పర్‌ఫెక్ట్ షాట్ కోసం సదరు నటుడిని ఆమె ఏకంగా 23 సార్లు చెంపదెబ్బలు కొట్టాల్సి వచ్చిందట. దర్శకుడు పదే పదే రీటేక్‌లు తీసుకోవడంతో జరిగిన ఈ ఘటనలో ఆ నటుడి చెంపలు ఎర్రబడిపోయినా? ఆయన ఏమాత్రం అసహనం చెందకుండా వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. షూటింగ్ విరామంలో ఆమె క్షమాపణలు కోరినప్పుడు కూడా ఆయన ఎంతో హుందాగా స్పందించి దృశ్యం బాగా రావడమే ముఖ్యం అని ప్రోత్సహించడం వారి మధ్య ఉన్న గౌరవానికి నిదర్శనం.

 

కేవలం నటనలోనే కాకుండా? వ్యక్తిగత జీవితంలోనూ ఆ స్టార్ హీరో ఎంతో నిరాడంబరంగా ఉంటారని సదరు నటి ప్రశంసించారు. ముఖ్యంగా ఆయనకు వంట చేయడంపై ఉన్న ఆసక్తిని గురించి చెబుతూ ఆయన స్వయంగా కనిపెట్టిన ఒక ప్రత్యేకమైన దోశ రుచికి పరిశ్రమలో ఎంతోమంది అభిమానులు ఉన్నారని వెల్లడించారు. షూటింగ్ విరామాల్లో లేదా స్నేహితుల గెట్-టుగెదర్‌లలో ఆయన స్వయంగా వంటగదిలోకి వెళ్లి అందరికీ వేడి వేడి దోశలు వడ్డిస్తుంటారన్నారు. ఆ ఆప్యాయత , రుచి మరెక్కడా దొరకదని  సంతోషం వ్యక్తం చేశారు.

 

కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న  అగ్ర నటుడు  తోటి నటీనటుల పట్ల ఇంతటి సాన్నిహిత్యం చూపడం ఆశ్చర్యపరిచే విషయం. ప్రస్తుతం ఆ స్టార్ నటుడు  తదుపరి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓ సోషియో ఫాంటసీ చిత్రం షూటింగ్ పూర్తి కాగా మరో  దర్శకుడితో యాక్షన్ ఎంటర్టైనర్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఎన్నో ఏళ్లు గడిచినా? కెరీర్ ప్రారంభంలో ఏర్పడిన ఆ స్నేహానుబంధం ఏమాత్రం తగ్గలేదని  మరింత బలపడిందని సదరు నటి పేర్కొన్నారు.

Actress Slapped Star Hero for 23 times for single take:

Guess The Hero who got for 23 times

Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ