Advertisementt

క‌ల్తీ పురుగుమందుల ముప్పుపై కాజ‌ల్ పోరాటం

Wed 29th Apr 2026 10:31 AM
kajal aggarwal  క‌ల్తీ పురుగుమందుల ముప్పుపై కాజ‌ల్ పోరాటం
Kajal Aggarwal war against toxic pesticides క‌ల్తీ పురుగుమందుల ముప్పుపై కాజ‌ల్ పోరాటం
Advertisement
Ads by CJ

 

 

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం `ది ఇండియా స్టోరీ`. సామాజిక ఇతివృత్తంతో కూడిన నేషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను పట్టిపీడిస్తున్న ఒక తీవ్రమైన సమస్యను ఆధారంగా చేసుకుని దర్శకుడు చేతన్ డికె ఈ చిత్రాన్ని రూపొందించారు. సాగర్ బి షిండే కథను అందించడమే కాకుండా ఈ ప్రాజెక్టును నిర్మించారు. కేవలం ఒక కుటుంబానికో లేదా ప్రాంతానికో పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో చర్చించాల్సిన ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ సినిమాలో బలంగా చూపించబోతున్నారు.

 

ఈ సినిమా ప్రధానంగా వ్యవసాయ రంగంలో రసాయనాల దుర్వినియోగం.. పురుగుమందుల కల్తీ వల్ల తలెత్తుతున్న భయంకరమైన పరిణామాలను చర్చిస్తుంది. మన కళ్ళ ముందే జరుగుతున్నా చాలా మంది గమనించని ఈ పర్యావరణ .. మానవ సంక్షోభాన్ని ఈ కథలో ఎండగట్టారు. వ్యవస్థలోని లోపాలను, ప్రభుత్వ నియంత్రణ సంస్థల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తూనే... ప్రజారోగ్యంపై ఇవి చూపుతున్న ప్రభావాన్ని కథలో చూపించనున్నారు. కాజల్ అగర్వాల్- శ్రేయాస్ తల్పాడే తమ నటనతో కథకు ప్రాణం పోశారని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం సమాజంలో ఒక అర్ధవంతమైన చర్చకు దారితీస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

Kajal Aggarwal war against toxic pesticides:

Kajal Returns to Screens with The India Story -Slow Poison in Progress

Tags:   KAJAL AGGARWAL
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ