Advertisementt

భేషజాలు లేని పని రాక్షసుడు

Wed 29th Apr 2026 09:07 AM
thaman  భేషజాలు లేని పని రాక్షసుడు
Thaman - The workaholic భేషజాలు లేని పని రాక్షసుడు
Advertisement
Ads by CJ

 

 

టాలీవుడ్ సంగీత ప్రపంచంలో  తమన్ ప్రస్థానం విలక్షణమైనది. ఆయన  చార్ట్‌బస్టర్ సాంగ్స్ ఇచ్చే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు.  ఇండస్ట్రీలో ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌ అత్యవసర సమయాల్లో అండగా నిలిచే ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందారు. సాధారణంగా ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరొకరు సగం చేసిన ప్రాజెక్టులోకి ప్రవేశించడానికి లేదా చివరి నిమిషంలో బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడరు. అది తమ ఇమేజ్‌కు భిన్నమని భావిస్తారు.

 

కానీ తమన్ విషయంలో మాత్రం ఇది పూర్తిగా వేరు. పని పట్ల ఉన్న అంకితభావాన్ని, దర్శకులు తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తూ, ఎంతటి క్లిష్టమైన ప్రాజెక్టునైనా సవాలుగా తీసుకుని పూర్తి చేయడం త‌మ‌న్ నైజం.

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో తమన్  ఉదారతను చాటుకున్నారు.

 

ఈ చిత్రానికి మొదట దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించినా?  చివరి నిమిషంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను తీసుకున్న తమన్ ఎటువంటి భేషజాలు లేకుండా సినిమాకు తనదైన శైలిలో ప్రాణం పోశారు. తాజాగా వెంకటేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో  తెర‌కెక్కుతోన్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 ప్రాజెక్టులోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది.

 

తొలుత హర్షవర్ధన్ రామేశ్వర్‌ను ఎంపిక చేసినా? కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో త్రివిక్రమ్ కోరిక మేరకు తమన్  ఈ ప్రాజెక్టును టేకప్ చేసార‌ని తెలిసింది. ఇలా మరొకరు వదిలేసిన పనిని స్వీకరించడం తన స్థాయికి తక్కువని భావించకుండా ముందుకు రావడం తమన్ వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని చాటుతోంది.

Thaman - The workaholic:

Thaman Commitment towards his work

Tags:   THAMAN
Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ