Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> GV Prakash Kumar Comes On Board For NKRAR2

NKRAR2 లోకి ఎంటర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్

GV Prakash Kumar Comes On Board For NKRAR2

 

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి భారీ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌ #VenkyAnil5/ #NKRAR2 తో అలరించబోతున్నారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరైన జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన విషయాన్ని ప్రత్యేకంగా, వినోదాత్మకంగా ప్రకటిస్తూ మేకర్స్ అనిల్ రావిపూడి స్టైల్‌లో ఓ ఫన్‌ఫుల్ వీడియోను విడుదల చేశారు.

ఈ ప్రమోలో దిగ్గజ దర్శకుడు జంధ్యాల క్లాసిక్ చిత్రం ఆహా నా పెళ్లంటలోని ఐకానిక్ సన్నివేశానికి నివాళిగా, పాత్రలను మెడ వరకు ఇసుకలో పాతిపెట్టిన సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. సరదా ట్విస్ట్‌గా జీవీ ప్రకాష్ కుమార్ కూడా అదే పరిస్థితిలో కనిపిస్తారు. అప్పుడు అనిల్ రావిపూడి వచ్చి, సినిమా పండుగ వాతావరణానికి తగ్గట్టుగా చార్ట్‌బస్టర్ ట్యూన్స్ కావాలని అడగడం నవ్వులు పూయిస్తుంది. ఈ వీడియో ద్వారా ప్రముఖ గేయరచయిత అనంత శ్రీరామ్ కూడా ఈ చిత్ర బృందంలో భాగమని అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రియేటివ్ అనౌన్స్‌మెంట్‌తో మరోసారి అనిల్ రావిపూడి తన సినిమాల్లోనే కాదు, ప్రమోషన్స్‌లో కూడా ఫన్  టచ్ ఎంత బలంగా ఉంటుందో చూపించారు. అదే సమయంలో ఈ చిత్రం అందించబోయే సంపూర్ణ వినోదానికి హింట్  కూడా ఇచ్చారు. త్వరలోనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో పాటు రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

 

GV Prakash Kumar Comes On Board For Venkatesh, Kalyan Ram, Anil Ravipud For NKRAR2