తిరుపతి సభలో జగన్ పై మంత్రి నారా లోకేష్ సెటైర్స్
Minister Nara Lokesh Satirical Comments On Ys Jagan
కూటమి ప్రభుత్వ పాలనా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రతి ఇంటికీ వెళ్లి.. గడపగడపలోనూ వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
రాయలసీమను రాయల్ సీమగా మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, ఇందుకోసం రూ.లక్ష కోట్ల భారీ బడ్జెట్‌తో మిషన్ రాయలసీమ ప్రాజెక్టును చేపట్టబోతున్నామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. 2014-19 మధ్య స్వర్ణయుగం వంటి పాలనను గత ఎన్డీయే అందించిందన్నారు. కానీ, 2019-24 మధ్య ఒక్కఛాన్స్ అంటూ వచ్చిన గొడ్డలి పార్టీ అరాచకాలు సృష్టించిందని నారా లోకేష్ దుయ్యబట్టారు.
ప్రతిపక్ష నేత జగన్‌కు సీసీడీ అనే జబ్బు ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇంకొంత కాలం సమయం ఇస్తే, ఆగస్టు 15న ప్రెస్‌మీట్ పెట్టి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది మా తాతేనని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు, రాజకీయాల్లో చంద్రబాబు విరాట్ కోహ్లీ అని.. బౌలర్స్ మారినా, బ్యాట్స్‌మెన్ చంద్రబాబే అని లోకేష్ అన్నారు.
వై నాట్ 175 అన్నవారికి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని, సిద్ధం అన్నవారికి ప్రజలు యుద్ధం ప్రకటించారని నారా లోకేష్ జగన్ ని ఆయన పార్టీని తిరుపతి విజయోత్సవ సభలో కడిగిపారేశారు.,








































