మెగాస్టార్‌తో కన్నడ బ్యూటీ ఢీ?

Rachita Ram in Mega 158

 

మెగాస్టార్ చిరంజీవి- మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో మరో క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ `చిరు 158`  తెర‌కెక్కుతోన్న‌సంగ‌తి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మరింత గ్రాండ్‌గా, వైవిధ్యంగా  బాబీ సరికొత్త స్క్రిప్ట్‌తో పాటు బలమైన పాత్రలతో ప‌ట్టాలెక్కించాడు. తాజాగా  ఈ చిత్రానికి సంబంధించిన  ఆసక్తికర కాస్టింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది.

కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా  గుర్తింపు తెచ్చుకున్న నటి రచితా రామ్  మెగా ప్రాజెక్ట్‌లో  కీలక పాత్ర కోసం ఎంపికైనట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని.. విలన్ షేడ్స్  లేదా సరికొత్త నెగటివ్ యాంగిల్‌లో  కనిపించబోతోందని ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే మలయాళ యువ నటి అనశ్వర రాజన్ కూడా ఇదే సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా తాజాగా రచితా రామ్ ఎంట్రీతో  ప్రాజెక్ట్‌కు మరింత క్రేజ్ తోడైంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్-ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఇతర భాషల నటీనటులను కీలక పాత్రల్లో ఎంపిక చేయడం  ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా మాస్ సినిమాల్లో విలన్ ..సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం కన్నడ, మలయాళ ఇండస్ట్రీల నుండి నైపుణ్యం గల ఆర్టిస్టులను తీసుకురావడంతో  ఆయా మార్కెట్లలో కూడా సినిమాకు మంచి రీచ్ లభిస్తుంది. దర్శకుడు బాబీ కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేయడంలో దిట్ట . ఈ నేప‌థ్యంలో  చిరంజీవి లాంటి లార్జర్-దన్-లైఫ్ నటుడికి దీటుగా నిలిచేలా ఈ లేడీ విలన్  పాత్రను ఎలా డిజైన్ చేస్తున్నార‌న్న‌ది ఆసక్తికరంగా మారింది.

Sandalwood Star in Mega 158