ఎన్టీఆర్ తో కష్టమే బుచ్చి

Will NTR Accept Buchi Babu ScriptWill NTR Accept Buchi Babu Script


పెద్ది ఫిగర్స్ ని అఫీషియల్ గా మేకర్స్ పోస్టర్స్ వేస్తున్నారు కానీ.. పెద్ది ని చూసిన కామన్ ఆడియన్స్ బుచ్చి బాబు ని తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతున్నారు. రామ్ చరణ్ లాంటి స్టార్ తో ఇలాంటి సినిమానా తీసేది అంటూ బుచ్చి ని విమర్శిస్తున్నారు. పెద్ది రిమార్క్స్ లో రామ్ చరణ్ తప్పేమి లేదు. దర్శకుడిని నమ్మాడు, ఆయన చెప్పింది చేసాడు.

రామ్ చరణ్ కష్టాన్ని గుర్తించి, బుచ్చి బాబు రామ్ చరణ్ తో పెద్ది లాంటి సినిమా చెయ్యడమేమిటి అంటున్నారు. ఎన్టీఆర్ బుచ్చి బాబు బారిన పడకుండా తప్పించుకున్నాడు అంటుంటే.. పెద్ది హిట్ తో బుచ్చి బాబు ఎన్టీఆర్ దగ్గరకు వెళ్తాడు, మూడో ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో ఓకే చేయించుకుంటాడు అనుకున్నారు.

కానీ సోషల్ మీడియాలో పెద్ది పై వస్తున్న కామెంట్స్ చూసిన వారు ఎన్టీఆర్ బుచ్చిబాబు ని దరిదాపుల్లోకి కూడా రానియ్యడు, చూస్తారా అంటూ మాట్లాడుకోవడం హైలెట్ అవుతుంది. మరి నిజంగానే బుచ్చి బాబు ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలంటే ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల్సిందే. 

Is It Buchi Babu Mistake