ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> what happens If Peddi release with Dhurandhar

పెద్ది ధురంధర్ తో పాటు వచ్చి ఉంటే

what happens If Peddi release with Dhurandhar

 

మార్చ్ 19 న ధురంధర్ రిలీజ్ అన్నప్పుడు మార్చ్ 27 న పెద్ది రావాల్సి ఉంది. గత ఏడాది రామ్ చరణ్ బర్త్ డే కి మార్చి 27, 2026 పెద్ది రిలీజ్ అని అనౌన్స్ చేసారు. కానీ మార్చ్ 19 కి ధురంధర్ 2 వస్తుంది అన్నప్పటికి మార్చ్ 27 నే పెద్దిఅన్నారు. కానీ షూటింగ్ అవ్వక పెద్ది ని లాస్ట్ మినిట్ లో ఏప్రిల్ 30 కి పోస్ట్ పోన్ చేసారు కానీ..

లేదంటే ధురంధర్ 2 దెబ్బకి పెద్ది పాన్ ఇండియా మార్కెట్ లో కంటికి కనిపించేది కాదు. రామ్ చరణ్ నటించిన పెద్ది గత గురువారమే విడుదలైంది. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రాలేదు. ఒకాసారి చూసాక మళ్లీ పెద్దిని చూసే సాహసం ఎవరూ చెయ్యరు. రామ్ చరణ్ పెరఫార్మెన్స్, రెహమాన్ మ్యూజిక్ తప్ప పెద్ది లో చెప్పుకునేందుకు ఏది లేదు.

జాన్వీ కపూర్ కేరెక్టర్, బుచ్చి బాబు డైరెక్షన్ అన్ని మైనస్ అంటున్నారు. మరి ధురంధర్ ద రివెంజ్ సినిమాని ఒకటికి రెండుసార్లు వీక్షించారు. ఆ చిత్రం తో పాటుగా పెద్ది విడుదలై ఉంటే ధురంధర్ సునామీలో పెద్ది కొట్టుకుపోయేది. ఈమాత్రం కలెక్షన్స్ కూడా పెద్ది వచ్చేవి కాదు అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Dhurandhar Storm Peddi Sustained Due to postponment