అక్కినేని ఫ్యాన్స్ ని హ్యాండిల్ చెయ్యడం కష్టమే
Big Headache For Lenin Makers
నిజమే ఈసారి అక్కినేని అభిమానులను నిర్మాత నాగవంశీ, నాగార్జున హ్యాండిల్ చెయ్యడమే కష్టమే అనిపిస్తుంది. లెనిన్ తో అఖిల్ బాబు హిట్ కొట్టాలని అభిమానులు చాలా కసిగా ఉన్నారు. మురళి కిషోర్ అబ్బూరి పై చాలా హోప్స్ పెట్టుకోవడమే కాదు సోషల్ మీడియాలో లెనిన్ ఉద్యమానికి తెరలేపారు.
లెనిన్ అప్ డేట్స్ మేకర్స్ కన్నా ముందే అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లెనిన్ టీజర్ విషయం కూడా మేకర్స్ కన్నా ముందే అభిమానులు లీక్ చేసారు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ లెనిన్ ప్రమోషనల్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ జరుగుతాయో అనేది కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.
తిరుపతిలో లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్, వైజాగ్ లో సాంగ్ రిలీజ్ ఈవెంట్, హైదరాబాద్ లో లెనిన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటూ లెనిన్ ఈవెంట్స్ లిస్ట్ లు చెబుతున్నారు. మాస్ జాతర లోడింగ్ అంటూ అక్కినేని అభిమానులు చేస్తున్న రచ్చ చూస్తే నాగవంశీ ఏ హీరో అభిమానులనైనా హ్యాండిల్ చేయొచ్చేమో గాని అక్కినేని ఫ్యాన్స్ ని హ్యాండిల్ చెయ్యడం కష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు.







































