ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Taylor Swift's Path to a Billion-Dollar Empire

షాకింగ్‌: గాయ‌ని ఆస్తి 19000 కోట్లు!

Taylor Swift's Path to a Billion-Dollar EmpireTaylor Swift's Path to a Billion-Dollar Empire

 

అంతర్జాతీయ పాప్ సంగీత ప్రపంచాన్ని తన స్వరాలతో శాసిస్తున్న టేలర్ స్విఫ్ట్ ఆర్థికంగా సరికొత్త సంచలనం సృష్టించారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. స‌ద‌రు గాయ‌ని నికర ఆస్తి విలువ ప్రస్తుతం 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.19000 కోట్లు) మార్కును తాకింది. సాధారణంగా సెలబ్రిటీలు ఈ స్థాయి సంపదను ఆర్జించడానికి ర‌క‌ర‌కాల సైడ్ బిజినెస్ ల‌ను ఆశ్ర‌యిస్తారు. రకాల బ్యూటీ బ్రాండ్స్, ఫ్యాషన్ లైన్స్ లేదా ఇతర వ్యాపారాలపై ఆధారపడుతుంటారు. అయితే టేలర్ స్విఫ్ట్ మాత్రం కేవలం తన సంగీత సృజనాత్మకత, పాటల రచన, రికార్డింగ్స్ అమ్మకాలు- లైవ్ కాన్సర్ట్స్ ద్వారానే ఈ అరుదైన బిలియనీర్ హోదాను సొంతం చేసుకున్న మొట్టమొదటి గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్‌గా అవతరించారు.

త‌న‌ను ఈ స్థాయికి చేర్చినది `ది ఎరాస్ టూర్`. ఈ టూర్ లో భాగంగా టేల‌ర్ భార‌త‌దేశంలోను ప‌ర్య‌టించారు. ప్రపంచవ్యాప్తంగా వందలాది స్టేడియాల్లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగిన ఈ సంగీత ప్రయాణం, చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టూర్‌గా నిలిచింది. కేవలం టికెట్ల రూపంలోనే కాకుండా దీని ఆధారంగా వచ్చిన కాన్సర్ట్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. తన పాటల మేధో సంపత్తి హక్కులను తన వద్దే ఉంచుకుంటూ.. కెరీర్‌ను తెలివిగా ప్లాన్ చేసుకున్న టేలర్.. వచ్చిన సంపదలో పెద్ద మొత్తాన్ని తుఫాను బాధితులకు.. తన టూర్ కోసం రాత్రింబగళ్లు శ్రమించిన సిబ్బందికి బోనస్‌ల రూపంలో అందించి తన ఉదారతను చాటుకున్నారు. 36 ఏళ్ల ప్రాయంలోనే  టేల‌ర్ స్విఫ్ట్ సాధించిన ఈ విజయం భవిష్యత్తు తరం కళాకారులకు ఒక సరికొత్త ఆర్థిక వ్యూహాన్ని నేర్పిస్తోంది.

 

Billionaire singer Taylor Swift