ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Can Ram charan create History With Peddi

పెద్ది కి పుష్ప టెన్షన్

Can Ram charan create History With Peddi


అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి పుష్ప టెన్షన్ వెంటాడుతుంది. రామ్ చరణ్ ఆచార్య, గేమ్ చేంజర్ తర్వాత పెద్ది చిత్రంతో హిట్ కొట్టాలని ఓ పక్కన మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నా.. మరోపక్క అల్లు అర్జున్ పుష్ప కి మించి పెద్ది హిట్ అవ్వాలని వారు మరింతగా కోరుకుంటున్నారు. పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 లతో పాన్ ఇండియాలో ఎదురులేని హీరోగా అల్లు అర్జున్ ఎదిగారు.

ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా మార్కెట్ లో బలమైన ముద్రవేసిన రామ్ చరణ్ కి ఆతర్వాత గేమ్ చేంజర్ తో బిగ్ షాక్ తగిలింది. అందుకే పెద్దితో రామ్ చరణ్ పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చెయ్యాలని, అది కూడా పుష్ప కు మించి అనేది వారి కోరిక. పుష్ప అంత కలెక్షన్స్ పెద్ది రాబట్టాలని వారు మొక్కని దేవుడు లేదు.

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో రామ్ చరణ్ పెద్దిని ప్రమోట్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి బెంగుళూరు వరకు పెద్దిని ప్రమోట్ చేసిన చరణ్ ఇక మీదట రెండు తెలుగు రాష్ట్రల్లో పెద్దిని అభిమానుల మధ్యన ప్రమోట్ చేసేందుకు రెడీ అయ్యారు. విజయవాడలో పెద్ది భారీ ఈవెంట్ ప్లాన్ చేసారు. తర్వాత హైదరాబాద్.

మరి మెగా అభినుల కోరిక పెద్ది తీరుస్తాడో , లేదో అనేది జస్ట్ ఇంకో 4 డేస్ వెయిట్ చేస్తే తెలిసిపోతుంది. 

Ram charan pinning Hopes On Peddi