Advertisementt

పవన్-విజయ్ ఇదేం పోలిక

Thu 19th Mar 2026 05:17 PM
pawan and vijay  పవన్-విజయ్ ఇదేం పోలిక
Comparison on Vijay and Pawan personal life పవన్-విజయ్ ఇదేం పోలిక
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు, పదేళ్లు పోరాడి గెలిచారు. ఇప్పుడు ఆయన ఉన్నతమైన స్థానంలో రాజపూజ్యం అందుకుంటున్నారు. అదే రకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన కూడా పోరాటాన్ని ఆరంభించారు. విజయ్ భవితవ్యం ఏప్రిల్ లో తమిళనాట జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడుతుంది. 

అయితే పవన్ మాదిరి విజయ్ నెమ్మదిగా రాజకీయాల్లో ఎదుగుతారా, లేదంటే ఒక్క దెబ్బకే సీఎం పొజిషన్ అందుకుంటారా అనే విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క పవన్ కళ్యాణ్ అలాగే విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ముడిపెట్టి వార్తలు వండివారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చేముందు రేణు దేశాయ్ నుంచి విడాకులు తీసుకుని అన్నా లెజెనోవాని వివాహం చేసుకున్నారు.

ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఆయన భార్య నుంచి విడాకులు తీసుకుని నటి త్రిష ను వివాహమాడతారా, అచ్చం పవన్ మాదిరి విజయ్ చేస్తారా అనే మాట కొన్ని మీడియా సంస్థలు స్పెషల్ గా చర్చకు తెరలేపాయి. విజయ్ కి త్రిష తో ఉన్న ఎఫ్ఫైర్ కారణంగానే ఆయన భార్య విజయ్ కు విడాకులిస్తుంది. 

అందుకే విజయ్ భార్య నుంచి విడిపోయాక త్రిషని పెళ్లి చేసుకుంటారా.. అప్పట్లో రేణు దేశాయ్ కూడా పవన్ కి వీరెవరితో ఉన్న ఎఫ్ఫైర్ కారణంగానే విడాకులిచ్చింది. అచ్చం పవన్-విజయ్ ల జీవితం ఒకేలా ఉండబోతుందా అంటూ మాట్లాడుతుంటే.. విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఇదేం పోలిక అంటూ మండిపడుతున్నారు.

Comparison on Vijay and Pawan personal life:

Comparisons between Pawan and Vijay

Tags:   PAWAN AND VIJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ