Advertisementt

అప‌రిచితుడు విక్ర‌మ్‌తో శంక‌ర్

Fri 20th Feb 2026 07:51 PM
shankar  అప‌రిచితుడు విక్ర‌మ్‌తో శంక‌ర్
Shankar Next With Vikram అప‌రిచితుడు విక్ర‌మ్‌తో శంక‌ర్
Advertisement
Ads by CJ

 

 

శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ `వేల్పారి` గురించి ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న లీకులు నిజంగా మైండ్ బ్లోయింగ్. అపరిచితుడు, ఐ సినిమాల తర్వాత విక్రమ్ మ‌రోసారి శంకర్ తో క‌ల‌వ‌బోతున్నార‌ని స‌మాచారం. ఈ కాంబో అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. `ఇండియ‌న్ 2` ప‌రాజ‌యం పాల‌వ్వ‌క‌పోతే శంక‌ర్ కి తిరుగుండేది కాదు. కానీ ఇప్పుడు లోప్రొఫైల్ లో ఉండి కూడా అత‌డు మ‌రో పెద్ద బడ్జెట్ సినిమాని భారీ కాస్టింగ్ తో ప్లాన్ చేస్తుండ‌టం చ‌ర్చ‌గా మారింది.

 

ర‌ణ్ వీర్ సింగ్- ధ‌నుష్- విక్ర‌మ్ లాంటి భారీ తారాగ‌ణంతో వేల్పారి చిత్రాన్ని శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నార‌ని క‌థ‌నాలు రావ‌డం వేడెక్కిస్తోంది. ముఖ్యంగా జాతీయ ఉత్త‌మ న‌టుల‌ను అత‌డు త‌న సినిమా కోసం డ్రాగ్ చేస్తున్నారు. అన్నియ‌న్ ఫేం విక్ర‌మ్  ఇందులో రాజు పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. ఈ సినిమా క‌థ‌ `వేల్పారి` అనే గిరిజన రాజు.. చేర, చోళ, పాండ్య సామ్రాజ్యాల మధ్య జరిగే యుద్ధం అని చెబుతున్నారు. ఇందులో విక్రమ్ ఒక శక్తివంతమైన రాజవంశానికి చెందిన రాజుగా కనిపిస్తారని, వేల్పారికి (రణవీర్ సింగ్ పాత్ర అని టాక్) వ్యతిరేకంగా నిలిచే బలమైన ప్రతినాయక ఛాయలున్న పాత్ర అని టాక్ ఉంది. విక్రమ్, రణవీర్ ఇద్దరూ `వేల్పారి` లోని రెండు వేర్వేరు కాలమానాల్లో లేదా రెండు భిన్నమైన తెగలకు నాయకులుగా కనిపిస్తారనే ప్రచారం కూడా ఉంది.

 

విక్రమ్ అంటేనే శారీరక మార్పులకు కేరాఫ్ అడ్రస్. శంకర్ ఈ చిత్రంలో విక్రమ్ కోసం ఒక `రా అండ్ రగ్గడ్` లుక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2000 ఏళ్ల క్రితం నాటి కథ కావడంతో యుద్ధ వీరుడి పాత్ర కోసం విక్రమ్ ఇప్పటికే తన బాడీ లాంగ్వేజ్‌పై వర్క్ చేస్తున్నారని సమాచారం.

Shankar Next With Vikram:

Shankar To join Hands With vikram

Tags:   SHANKAR
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ