Advertisementt

స్టార్ హీరోకి గ్యాంగ్ స్ట‌ర్ వార్నింగ్

Fri 20th Feb 2026 06:21 PM
ranveer singh  స్టార్ హీరోకి గ్యాంగ్ స్ట‌ర్ వార్నింగ్
Gangster Warning To Star Hero స్టార్ హీరోకి గ్యాంగ్ స్ట‌ర్ వార్నింగ్
Advertisement
Ads by CJ

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అస్స‌లు త‌గ్గ‌డం లేదు! వీళ్ల అరాచకాల‌కు హ‌ద్దే లేకుండా పోతోంది. వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్న సెల‌బ్రిటీల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేస్తున్నారు. మ‌రోవైపు నాయ‌కులు, అధికారులకు కూడా ఈ గ్యాంగ్ భ‌య‌ప‌డ‌టం లేదు. కొన్నేళ్లుగా ప్రకంపనలు అగ‌డం లేదు సరి కదా, ఇప్పుడు స్టార్ హీరో రణవీర్ సింగ్‌ను కూడా టార్గెట్ చేయడం షాకింగ్‌గా మారింది. సల్మాన్ ఖాన్ తర్వాత వరుసగా స్టార్ హీరోలకు, దర్శకులకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇండస్ట్రీని ఒణికిస్తోంది.

 

ఇటీవ‌ల ర‌ణ్ వీర్ కి వార్నింగ్ ఇస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వాయిస్ మెయిల్ పంపింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇప్పుడు కూడా  గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ ముఠాకు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో రణవీర్ సింగ్ మేనేజర్‌కు వాట్సాప్ వాయిస్ నోట్ వచ్చింది. అందులో రూ.10 కోట్లు ఇవ్వాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వాయిస్ నోట్ అమెరికా నంబర్ నుండి రావడంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. అక్కడి అధికారుల సహాయంతో ఆ నంబర్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.

 

దర్శకుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద కాల్పులు జరిగిన త‌ర్వాత బెదిరింపులు రావడం గమనార్హం. దీనిని విశ్లేషిస్తే.. ఈ గ్యాంగ్ మొత్తం `సింగం` టీమ్‌ను లేదా రోహిత్ శెట్టి కాంపౌండ్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రణవీర్ సింగ్‌కు భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఇంకా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయకపోయినా ప్రాథమిక విచారణ వేగంగా జరుపుతున్నారు.

 

బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో కేవలం కృష్ణజింకల కేసులో ప్ర‌ధాన నిందిత‌డిగా ఉన్న స‌ల్మాన్ ఖాన్ చుట్టూనే తిరిగేది, కానీ ఇప్పుడు అది వసూళ్ల పర్వం (ఎక్స్‌టార్ష‌న్‌) వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. రణవీర్ సింగ్ లాంటి క్రేజీ స్టార్‌ను టార్గెట్ చేయడం ద్వారా వారు పెద్ద మొత్తంలో డబ్బును ఆశిస్తున్నారు.

 

ముంబై పోలీసులు ఇలాంటి బెదిరింపులను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. రణవీర్ సింగ్ ఈ సమస్య నుండి త్వరగా బయటపడి త‌దుప‌రి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలోను న‌టించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ణ్ వీర్-ధ‌నుష్‌- విక్ర‌మ్ కాంబినేష‌న్ లో వేల్పారి మొద‌లవుతుందా లేదా? అన్న‌ది ఇంకా స‌స్పెన్స్. అధికారికంగా అప్ డేట్ వ‌స్తుందేమో చూడాలి. మ‌రోవైపు దురంధ‌ర్ 2 మార్చిలో రిలీజ్ కానున్నందున ర‌ణ్ వీర్ ప్ర‌మోష‌న్స్ కి రెడీ అవుతున్నాడు. త‌దుప‌రి ఫ‌ర్హాన్ తో డాన్ 3లో న‌టించేందుకు ఆస్కారం లేద‌ని కూడా వివాదాలు స్ప‌ష్ఠం చేస్తున్నాయి.

Gangster Warning To Star Hero:

Gangster Warning To Ranveer Singh

Tags:   RANVEER SINGH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ