భారతదేశంలో మొదటి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో స్థాపితమవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టి క్వాంటమ్ ఎకోసిస్టమ్ ఏర్పాటుచేస్తున్నాం అని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. అమరావతిలో మనం భారతదేశ క్వాంటమ్ టెక్నాలజీలలో భవిష్యత్ నాయకత్వానికి పునాది వేస్తున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు. హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్, అల్గారిథమ్ లు, ఉత్పత్తులు, ఎగుమతులు, ప్రతిభావంతులకు శిక్షణ అన్నీ ఒకేచోట ఉండేలా దీనికి రూపకల్పన చేశాం.
ఈ సంకల్పం ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ వినియోగదారుగా కాకుండా, భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యున్నత సాంకేతిక ఆవిష్కరణ సృష్టికర్తగా నిలబెడుతుంది. అమరావతిని ప్రపంచంలోని ఐదు అత్యున్నత క్వాంటమ్ హబ్‌లలో ఒకటిగా ఉంచడమే మా ధ్యేయం. ఆంధ్రప్రదేశ్‌లో తయారైన క్వాంటమ్ కంప్యూటర్లు, కాంపోనెంట్‌లను ప్రపంచానికి ఎగుమతి చేయాలన్నది మా లక్ష్యం. మన యువతకు ప్రస్తుతం మాత్రమే కాకుండా.. భవిష్యత్ లో కూడా నిలకడైన ఉపాధి, ఆదాయం, ప్రపంచస్థాయి నైపుణ్యాలతో కూడిన వేలాది ఉద్యోగాలు కల్పించడం మా సంకల్పం. భారతదేశ డీప్ టెక్ ప్రయాణానికి స్థిరమైన ప్రోత్సాహం, వ్యూహాత్మక మద్దతు అందిస్తున్న ప్రధాని మోడీ గారికి మా కృతజ్ఞతలు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ గారు, నేషనల్ క్వాంటమ్ మిషన్ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు.
మేము క్వాంటమ్ మజిలీని ప్రారంభించేటప్పుడు మాకు అన్నివిధాలా సహకారం అందించిన మద్రాసు ఐఐటీ డైరెక్టర్ కామకోటి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ చారిత్రక ప్రయాణంలో వారు ఆంధ్రప్రదేశ్‌తో కలిసి నిలబడ్డారు. క్వాంటమ్ వ్యాలీ ఒక కాన్సెప్ట్ కాదు, అది ఇప్పటికే అమలులో ఉంది. అయితే భారతదేశంలోని అత్యాధునిక 133-క్యూబిట్ ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ ఇక్కడ ఆవిష్కృతం కాబోతోంది. ది క్వాంటమ్ ఇంజనీర్లు, అడ్వాన్స్‌డ్ AI, కంప్యూటింగ్ స్పెషలిస్టులు, చిప్ డిజైనర్లు, క్రయోజెనిక్స్ ఎక్స్‌పర్టులు, RF ఇంజనీర్లు, స్టార్టప్ ఫౌండర్లు, డీప్ టెక్ రీసెర్చర్లకు అవకాశాలను కల్పిస్తుంది.
విజనరీ లీడర్ చంద్రబాబు గారి నేతృత్వంలో అమరావతి భారతదేశం క్వాంటమ్ విప్లవాన్ని ముందుండి నడిపించబోతోంది.. అని మంత్రి నారా లోకేష్ పార్కోన్నారు.





ఫంకీ పై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి
Loading..