వరస వైఫల్యాలతో కెరీర్ లో సతమతమవుతున్న విశ్వక్ సేన్.. కేవీ అనుదీప్ తో కలిసి ఫంకీ చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. లైలా చిత్రంతో విమర్శలు పాలయిన విశ్వక్ సేన్ ఇప్పుడు ఫంకీ కామెడీ ఎంటర్టైనర్ తో నవ్వించడానికి సిద్ధమయ్యాడు. తాజాగా నిర్మాత నాగవంశీ ఫంకీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ప్రేక్షకులకు ఓ క్లారిటీ ఇచ్చాడు.
అంటే ఫీలవుతాడు కానీ అనుదీప్ దగ్గర అంతగా కథ ఉండదు, అతను కామెడీ పంచ్ లతోనే ఆడియన్స్ ని నవ్వించేస్తాడు, అయితే మంచి కథ, ఎమోషనల్ సీక్వెన్స్ లు ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని థియేటర్ కి రామాకండి, ట్రైలర్ లో ఎలా ఉందొ.. సినిమా లో అలాంటి పంచ్ లు కామెడీ ఉంటుంది, సినిమా చూసి నవ్వుకోవడానికి రండి.. విశ్వక్ అనుదీప్ స్టయిల్ ల్లో రెండు గంటలు ఎంటర్టైన్ చేస్తాడు. లాస్ట్ టైమ్ మిస్ ఫైర్ అయ్యింది అంటూ అనుదీప్ ఫీల్ అవుతూ ఉంటాడు కానీ ఈసారి గట్టిగా కడుతున్నాం అంటూ..
రీసెంట్ గా అనగనగ ఒకరాజు తో 100 కోట్లు వెనకేసుకున్న నిర్మాత నాగవంశీ చాలా కాన్ఫిడెంట్ గా ఫంకీ పై ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని సరదాగా చెప్పేసాడు. మరి ఫంకీ పై నిర్మాత నాగవంశీ కే మంచి హోప్స్ ఉన్నాయి. అందుకే అంత కాన్ఫిడెంట్ గా కనిపించాడు. చూద్దాం ఫంకీ విశ్వక్ ని అనుదీప్ ని ఒడ్డున పడేస్తుందో, లేదో అనేది.





వారణాసి సెట్ లోకి విలన్ ఎంట్రీ
Loading..