పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. వీటన్నింటిని పూర్తి చేసి మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇందులో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు? అన్నది ఇంత వరకూ కన్పమ్ అవ్వలేదు.
ఈ నేపథ్యంలో నాయిక పాత్రపై ఆసక్తి నెలకోంది. తాజాగా పీకేకి జోడీగా ఇమ్మాన్నవీ ఇస్మైల్ ని తీసుకుంటున్నారనే లీకైంది. సూరి రాసిన పాత్రకు ఇమ్మాన్వి పర్పెక్ట్ గా సూటవుతుందిట. దీంతో ఆమె అయితే బాగుంటుందని సూరి సూచించగా పవన్ కూడా ఒకే చెప్పినట్లు తెలిసింది. హీరోయిన్ విషయంలో సూరి అంత ఈజీగా కన్విన్స్ అవ్వడు. ఫాంలో ఉన్నా భామలకంటే పాత్రకు ఎవరు సెట్ అవుతారో? వాళ్లనే ఎంచుకుంటాడు.
ఈ విషయంలో సూచి జెన్యూన్ గా ఉంటాడు. సూరి గత సినిమాల్లో నటించిన హీరోయిన్ల లైనప్ చూస్తే ఈ విషయం అర్దమవుతుంది. ఈ విషయం పవన్ కి కూడా తెలుసు. అందుకే ఈసినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో పవన్ తొలి నుంచి ఇన్వాల్వ్ కాలేదు. సూచాయగా సూరి ముందే పవన్ చెవిన ఓ మాట వేసినా? నువ్వే ఫైనల్ చేసేయ్ అనేసాడు.
దీంతో సూరి ఆయన మాట ప్రకారం ముందుకెళ్లిపోతున్నాడు. ఇదే నిజమైతే ఇమాన్వీ జాక్ పాట్ కొట్టినట్లే. ఇప్పటికే అమ్మడు ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం `పౌజీ`లో నటిస్తోంది. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. రిలీజ్ కాకుండానే ఏకంగా పీకేతో ఛాన్స్ అంటే చిన్న విషయమా? ఎంతో అదృష్టం కలిసొస్తే గానీ సాధ్యంకాని ఛాన్స్ ఇది.





అమరావతి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం
Loading..