బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కొన్నేళ్లుగా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంది. అటు ఫిజిక్ విషయంలోనూ, ఇటు కేసుల విషయంలోనూ శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రా లు మీడియాలో తెగ ఫేమస్ అనే చెప్పాలి. ఇక ముంబై లో శిల్పా శెట్టి రీసెంట్ గా స్టార్ట్ చేసిన అమ్మకై రెస్టారెంట్ కూడా చాలా ఫేమస్. తాజాగా ఇక్కడొక ఆఫర్ పెట్టారు.
శిల్పా శెట్టి అమ్మకై రెస్టారెంట్ లో ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ అంటూ ప్రకటించారు. ఫ్రీ అంటే ఏ లేనివాళ్లో ఆ అమ్మకై రెస్టారెంట్ కి వెళ్లి ఫ్రీ గా బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి వచ్చారు అనుకుంటే పొరబాటే. ఆ ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ ప్రకటన చూసిన చాలామంది హై క్లాస్ పీపుల్ అమ్మకై రెస్టారెంట్ ఓపెన్ కాక ముందే అంటే రెండు గంటల ముందే లైన్ లో నిల్చోవడం ఆశ్చర్యమేసింది.
లేని వాళ్ళు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ కి ఆశపడ్డారు అంటే అర్థముంది. కానీ హై క్లాస్ పీపుల్ ఇలా ఓ రెస్టారెంట్ ముందు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్ కోసం లైన్ లో వేచి ఉండడమే అందరిని విస్మయానికి గురి చేస్తుంది.




చిరంజీవి-రెహమాన్ సెట్ అవుతోందా

Loading..