అన్నీ అనుకున్నట్లు జరిగితే మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి పాన్ ఇండియా సినిమా `సైరా నరసింహారెడ్డి`కి ఏ. ఆర్ . రెహమాన్ సంగీతం అందించాలి. రెహమాన్ కూడా అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ చివరి నిమిషంలో బిజీ షెడ్యూల్ కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. రెహమాన్ కమిట్ అయి ఇలా ఎగ్జిట్ అవ్వడం అప్పట్లో పెద్ద సంచనలంగానూ మారింది.
చిరంజీవి-రెహమాన్ మధ్య కొందరు తమిళులు రాజకీయాలు చేసారంటూ మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కించాయి. ఆ కారణంగానే రెహమాన్ కావాలనే తప్పుకున్నారు? అన్నది చర్చకొచ్చిన అంశం. అదంతా గతం. ఇప్పుడు అలాంటి విబేధాలు లేవు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న పెద్ది సినిమాకు రెహమాన్ సంగీతం అందిస్తోన్న సంగతి తెలిసిందే.
దర్శకుడు బచ్చిబాబుకి సంగీతమంటే ఓ టేస్ట్ ఉంది కాబట్టి పట్టుబట్టి రెహమాన్ ని ఒప్పించాడు. ఇప్పటికే తొలి లిరికల్ సాంగ్ `చికిరి చికిరి` అదరగొట్టిన సంగతి తెలిసిందే. రెహమాన్ ఈ మధ్య కాలంలో ఇచ్చిన బెస్ట్ సాంగ్ గా నిలిచింది. దీంతో మిగతా పాటలపై శ్రోతల్లో ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజా సినిమాకు రెహమాన్ ని నిదించాలనుకుంటున్నారు.
చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల ఓ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాల్సి ఉంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడి అనిరుద్ ని అనుకున్నారు. ఇంకా అతడితో డీల్ ఇంకా పూర్తి కాలేదు. చర్చల దశలోనే ఉంది. అయితే ఇప్పుడా స్థానంలో రెహమాన్ ని తీసుకోవాలని చిరు అండ్ కో భావిస్తోందిట. తనయుడితో పని చేస్తున్నందున తనతో కూడా పని చేయడానికి ఇదే సరైన సమయంగా చిరంజీవి భావిస్తున్నారుట. ఈ అవకాశాన్ని కూడా రెహమాన్ సద్వినియోగం చేసుకునే అవకాశాలున్నాయి.




దేవర సరే - డ్రాగన్ అడ్రెస్స్ ఎక్కడా 

Loading..