Advertisementt

దేవర సరే - డ్రాగన్ అడ్రెస్స్ ఎక్కడా

Wed 28th Jan 2026 09:23 AM
ntr  దేవర సరే - డ్రాగన్ అడ్రెస్స్ ఎక్కడా
NTR-Neel update please దేవర సరే - డ్రాగన్ అడ్రెస్స్ ఎక్కడా
Advertisement
Ads by CJ

వార్ 2 డిజప్పాయింట్ చెయ్యడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ ( వర్కింగ్ టైటిల్)షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తాజాగా బిగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని మరో లాంగ్ షెడ్యూల్ కి డ్రాగన్ టీమ్ రెడీ అవుతుంది. అయితే నిన్న మంగళవారం ఉన్నట్టుండి సోషల్ మీడియాలో దేవర 2 ట్రెండ్ అయ్యింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ సుధాకర్ దేవర 2 మే నుంచి స్టార్ట్ అవుతుంది అంటూ సూపర్ అప్ డేట్ ఇచ్చారు.

అది చూసిన వారు ఇంకా మొదలు కానీ దేవర 2 సరే.. ఇప్పటికే మొదలైన డ్రాగన్ సంగతి తేల్చండి. సినిమా స్టార్ట్ అయ్యి ఏడాది గడుస్తుంది. ఇంతవరకు ఫస్ట్ లుక్ లేదు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని తెగ వెయిట్ చేపిస్తున్నారు, ముందు నీల్ సర్ ఆ డ్రాగన్ ఫస్ట్ లుక్ విషయం తేల్చండి. అలాగే డ్రాగన్ విడుదల తేదీపై ఓ క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారు.

నిజమే గత ఏడాది మొదలైన ఈ ఎన్టీఆర్-నీల్ కాంబో మూవీ షూటింగ్ అప్ డేట్ కానీ, ఫస్ట్ లుక్ అప్ డేట్ కానీ, ఈ జనవరి నుంచి డ్రాగన్ పోస్ట్ పోన్ అయిన విషయం కానీ మేకర్స్ క్లారిటీ ఇవ్వకుండా నాన్చడం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మింగుడు పడడం లేదు. 

NTR-Neel update please:

NTR fans request NTR-Neel update

Tags:   NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ