Advertisementt

శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ డేట్

Thu 15th Jan 2026 07:20 PM
shambala  శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
Shambala Set for OTT Premiere శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ డేట్
Advertisement
Ads by CJ

ఆది సాయికుమార్ నటించిన రీసెంట్ సూపర్ హిట్ మూవీ శంబాల ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ నెల 22వ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు వస్తోంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్స్ కు ఒక రోజు ముందుగానే ఎర్లీ యాక్సెస్ తో ఈ సినిమాను చూడొచ్చు. ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ అందిస్తున్న ఆహా ఓటీటీ.. శంబాలతో మరోసారి కొత్త సబ్ స్క్రైబర్స్ ను ఆకర్షిస్తోంది.

గతేడాది డిసెంబర్ 25న శంబాల సినిమా మిస్టికల్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు యుగంధర్ ముని రూపొందించారు. అర్చన ఐయ్యర్ హీరోయిన్ గా నటించింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. 

ఈ మూవీకి ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్స్ లో మంచి వసూళ్లు సాధించిన శంబాల సినిమాను ఆహా ఓటీటీలో ప్రీమియర్ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

Shambala Set for OTT Premiere:

Shambala Set for OTT Premiere on aha from January 22

Tags:   SHAMBALA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ