ఈ సంక్రాంతికి హిట్ హీరోలు ఎంతగా వెయిట్ చేసారో, అంతకుమించి హీరోయిన్స్ కూడా వెయిట్ చేసారు. సంక్రాంతి బరిలోకి వచ్చిన రాజసాబ్ తో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కపూర్ లు డిజప్పాయింట్ అవ్వగా, నయనతార కు మన శంకర వరప్రసాద్ గారు హిట్ ఇచ్చింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి హిట్ రవితేజ కు ఎంత కీలకమో, డింపుల్ హయ్యాతి, ఆషిక రంగనాధ్ కి అంతే కీలకం.
భర్త మహాశయులకు యావరేజ్ టాక్ తో డింపుల్ హయ్యాతి, ఆషిక లు సేఫ్. ఇక నవీన్ పోలిశెట్టి సరసన నటించిన మీనాక్షి చౌదరి కి అనగనగ ఒక రాజు హిట్ ఇచ్చింది. గత ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం తో హిట్ కొట్టిన మీనాక్షి ఈ ఏడాది అనగనగ ఒకరాజు కూడా సక్సెస్ ని ఇచ్చింది.
ఇక నారి నారి నడుమ మురారి విడుదలైంది, హిట్ టాక్ తెచ్చుకుంది అలా సంయుక్త మీనన్ కి సాక్షి వైదే కి సక్సెస్ దక్కింది. అలా ఈ సంక్రాంతికి వచ్చిన హీరోయిన్స్ చాలావరకు సేఫ్ అయ్యారు.




జననాయగన్ రిలీజ్ ఉన్నట్టా లేనట్టా
Loading..