యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్) అసలైతే ఈనెల 26 రిపబ్లిక్ డే రోజున విడుదల తేదీ అంటూ మేకర్స్ ఎప్పుడో గత ఏడాది ఏప్రిల్ లోనే ప్రకటించారు. కానీ అది సాధ్యమయ్యే పనిగా లేదు. ఆ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా, చెయ్యరా అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాధ.
అసలు ఎన్టీఆర్-నీల్ షూటింగ్ ఎక్కడివరకు అయ్యింది, ఈ సంక్రాంతికి అయినా ఎన్టీఆర్ లుక్ వదులుతారా లేదా అనే ప్రశ్నలతో వారు సతమతమవుతున్నారు. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ గత ఏడాది మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కి రావాల్సింది. కానీ ఇప్పుడు వరకు డ్రాగన్ ఫస్ట్ లుక్ జాడ లేదు, కనీసం ఈ సంక్రాంతికి అయినా డ్రాగన్ ఫస్ట్ లుక్ తో పాటుగా కొత్త రిలీజ్ తేదీ ని ఇవ్వొచ్చు కదా అంటున్నారు.
అసలు ఎన్టీఆర్-నీల్ చప్పుడు చెయ్యడం లేదు, కొత్త షెడ్యూల్ ఎక్కడో, ఏమిటో చెప్పరు, అదే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఇరిటేట్ చేస్తుంది. నిర్మాత రవి శంకర్ మాత్రం మేము అనుకున్న తేదీలకే సినిమాలు విడుదల అయ్యేలా చూస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అది జరగదని తెలిసినా ఆయన అభిమానులకు హామీ ఇచ్చారు.
రుక్మిణి వసంత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో తోవినో థామస్ విలన్ గా నటిస్తున్నారని వార్తలున్నాయి. మరి ఏ విషయము మేకర్స్ ఏదో ఒక అప్ డేట్ ఇచ్చి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తేనే తెలుస్తుంది.




రెడ్ మినీ డ్రెస్ లో జాన్వీ కపూర్ షో 
Loading..