పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజా విడుదలకు సమయం ఆసన్నమైంది. జనవరి తొమ్మిది అంటే ఎల్లుండి శుక్రవారమే రాజసాబ్ ఆగమనం, అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చేసింది. ప్రస్తుతం రాజసాబ్ ప్రమోషన్స్ హోరెత్తిపోతున్నాయి. ప్రభాస్ కూడా ఈసారి దర్శకనిర్మాతలకు బాగానే కోపరేట్ చేసారు.
అయితే ప్రభాస్ సినిమా విడుదలకు ముందే వెకేషన్ కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా రాజసాబ్ విడుదలకు ముందు ఆయన ఇటలీ ట్రిప్ పెట్టుకున్నారు. ఈలోపే ప్రభాస్ రాజసాబ్ ని వీక్షించేసారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ప్రభాస్ రాజసాబ్ చూసినట్లుగా తెలుస్తుంది అంతేకాదు గత రాత్రి మరోసారి రాజసాబ్ ని ప్రభాస్ వీక్షించినట్లుగా తెలుస్తుంది.
ప్రభాస్ తో పాటుగా ఒకరిద్దరి డిస్ట్రిబ్యూటర్స్ కూడా రాజసాబ్ ని వీక్షించినట్టుగా సమాచారం. రాజాసాబ్ అవుట్ ఫుట్ పై ప్రభాస్ ఆయన స్నేహితులు సంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇక ఫ్యాన్స్ దే బాధ్యత, సినిమాని హిట్ చేసేది వారే కదా. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీ వెళ్ళబోతున్నారు.




ఎన్టీఆర్-నీల్ అనౌన్సమెంట్ ఉంటుందా 
Loading..