Advertisementt

ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య గొడ‌వ‌

Mon 22nd Dec 2025 03:10 PM
sivakarthikeyan  ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య గొడ‌వ‌
Fight between Gnanavel and SivaKarthikeyan ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య గొడ‌వ‌
Advertisement
Ads by CJ

ప్ర‌ముఖ న‌టుడు సూర్య బంధువు అయిన జ్ఞాన‌వేల్ రాజాపై కోలీవుడ్ స్టార్ హీరో శివ‌కార్తికేయ‌న్ ఆర్థిక లావాదేవీల వ్య‌వ‌హారంలో కోర్టుకెక్క‌డం చ‌ర్చ‌గా మారింది. మిస్ట‌ర్ లోక‌ల్ అనే సినిమాకు సంబంధించి 15 కోట్ల పారితోషికం చెల్లింపుల‌కు ఒప్పందం చేసుకున్న జ్ఞాన‌వేల్ ఆ మొత్తాన్ని చెల్లించ‌డంలో విఫ‌ల‌మ‌య్యారనేది ఆరోప‌ణ‌. ప‌లు ద‌ఫాలుగా 11 కోట్ల మేర చెల్లింపులు చేసిన త‌ర్వాత జ్ఞాన‌వేల్ మిగిలిన 4 కోట్ల బ‌కాయిని చెల్లించ‌లేద‌ని శివ‌కార్తికేయ‌న్ చెన్నై కోర్టును ఆశ్ర‌యించారు.

అంతేకాదు ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌కు చెల్లించాల్సిన టీడీఎస్‌ను కూడా ఎగ్గొట్టార‌ని, దాని వ‌ల్ల త‌న బ్యాంక్ ఖాతా నుంచి ఐటి శాఖ 90 ల‌క్ష‌లు లాక్కుంద‌ని కూడా శివ కార్తికేయ‌న్  పిటిష‌న్ లో పేర్కొన్నారు. త‌నకు రావాల్సిన బ‌కాయి చెల్లించేవ‌ర‌కూ జ్ఞాన‌వేల్ నిర్మిస్తున్న సినిమాల రిలీజ్ ల‌ను ఆపాల‌ని కూడా ఇంజ‌క్ష‌న్ లో కోరారు. జ్ఞాన‌వేల్ ప్ర‌స్తుతం నాలుగు చిత్రాల‌ను నిర్మిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

రెబల్, చియాన్ 61, పత్తు తల స‌హా మ‌రో చిత్రం ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్నాయి. త‌న డ‌బ్బు సెటిల్ చేసేవ‌ర‌కూ, వీట‌న్నిటి రిలీజ్ ల‌ను ఆపాల‌ని శివ కార్తికేయ‌న్ కోర్టును అభ్య‌ర్థించారు. జ్ఞాన‌వేల్ తో శివ‌న్న గొడ‌వ‌ను జ్ఞాన‌వేల్ బంధువే అయిన‌ సూర్య‌కు ముడిపెడుతూ నెటిజ‌నులు కామెంట్లు చేస్తున్నారు.  

ఇద్ద‌రు స్టార్ హీరోల న‌డుమ వివాదంగా ప్ర‌చారం చేస్తున్నారు.

Fight between Gnanavel and SivaKarthikeyan:

Fight between Gnanavel and SivaKarthikeyan

Tags:   SIVAKARTHIKEYAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ