బిగ్ బాస్ సీజన్ 9 లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ మొదటి వారం నుంచి ఆడియన్స్ ను ఆకట్టుకుని వారి మనసు గెలుచుకున్నాడు. ఇమ్మాన్యుయేల్ కామెడీని, ఆయన గేమ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే హౌస్ లో తనూజ తో ఫ్రెండ్లి గా ఉన్న ఇమ్మాన్యుయేల్ తనూజ కళ్యాణ్ తో తిరగడం స్టార్ట్ చేసాక ఆమెను దూరం పెట్టడమే కాదు ఆమెను టార్గెట్ చేస్తున్నాడు.
మరోపక్క బయట తనూజ గ్రాఫ్ పెరిగింది అని అతనికి తెలియయడంతో తనూజ తనకు పోటీ వస్తుంది అని భావించి తనూజ ను పదే పదే టార్గెట్ చేస్తూ నామినేట్ చేస్తున్నాడు. అయితే ఇమ్మాన్యుయేల్ కి అన్ని సరౌండింగ్స్ అంటే ఆడియన్స్, హౌస్ మేట్స్ ఇలా అన్ని వైపులనుంచి మంచి సపోర్ట్ ఉంది. కానీ అతను నామినేషన్స్ లో రాకపోవడమే అతను గ్రాఫ్ తగ్గడానికి కారణమైంది.
వరసగా పది వారాలు ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లో లేడు. గత రెండు వారాలుగా ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్ లోకి వస్తున్నాడు. కానీ అతనికి నెంబర్ 1 ప్లేస్ లో ఉండే ఓట్స్ పడడం లేదు. అటు తనూజ, ఇటు కళ్యాణ్ ఫ్యాన్స్ బేస్ స్ట్రాంగ్ గా మారడంతో ఇమ్మాన్యుయేల్ కి ఎఫెక్ట్ అయ్యింది.
నామినేషన్స్ లోకి వస్తే ఆడియన్స్ సపోర్ట్ ఉండి నెంబర్ 1 లో ఉంటాడు అనుకుంటే.. ఇమ్మాన్యుయేల్ ని లైట్ తీసుకుంటూ తనూజ, కళ్యాణ్ లకు ఓట్లు గుద్దుతున్నారు జనాలు. దానితో ఇమ్మాన్యుయేల్ మూడు, లేదంటే నాలుగో పొజిషన్ లో కనబడుతున్నాడు. కేవలం అతను నామినేషన్స్ లో రాకపోవడమే అతనికి ఎఫెక్ట్ అయ్యింది.




చివరి చిత్రం కోసం ఆ నిర్మాత పోరాటం
Loading..