దళపతి విజయ్ కథానాయకుడిగా హెచ్. వినోధ్ దర్శకత్వంలో `జన నాయగన్` భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. అదే రోజున `రాజాసాబ్`కూడా రిలీజ్ కు ఉన్నా? మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. `జన నాయగన్` తెలుగు రిలీజ్ కోసం బడా నిర్మాతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులో ముందుగా వినిపిస్తోన్న పేరు నిర్మాత నాగవంశీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా హక్కులు తానే దక్కించుకుని పంపిణి చేయాలని ప్లాన్ లో ఉన్నారుట. ఆ రకంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. కొన్నేళ్ల క్రితం విజయ్ నటించిన `లియో` హక్కులు కూడా వంశీనే దక్కించుకుని రిలీజ్ చేసారు. ఆ సినిమా ఓపెనింగ్స్ వరకూ పర్వాలేదు గానీ...లాంగ్ రన్ లో సినిమా ఆడలేదు. దీంతో నష్టాలు తప్పలేదు.
ఈనేపథ్యంలో ఆ లెక్కలన్నింటినీ `జననాయగన్` తో సరి చేసుకునే ప్రక్రియలో భాగంగా హీరో నుంచి విషయాన్ని డీల్ చేసుకుంటూ వస్తున్నాడుట. అలాగే విజయ్ నటిస్తోన్న చివరి సినిమా కూడా ఇదే కావడంతో తప్పకుండా తానే పంపిణీ చేయాలని పట్టుబడుతున్నాడుట. మరి ఈప్రచారంలో నిజానిజాలు తేలాల్సి ఉంది. నిర్మాత నాగవంశీ ఈ మధ్యనే బాలీవుడ్ చిత్రం `వార్ 2` రైట్స్ దక్కించుకుని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
సినిమాపై జరిగిన ప్రచారం అందులో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించడంతో? నాగవంశీ ప్రెస్టిజీయస్ గా ఆ చిత్రాన్ని రిలీజ్ చేసాడు. కానీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. తెలుగు సహా హిందీలోనూ డిజాస్టర్ అయింది. అలాగే ఈ మద్య కాలంలో ఆయన నిర్మాణం నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఆశించిన ఫలితాలు సాధించడం లేదు. ఈ నేపథ్యంలో `జన నాయగన్` తో మరో అటెంప్ట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.




కుమారుడిని రంగంలోకి దించుతున్నారా
Loading..