స్టంట్ మాస్టార్లు రామ్ -లక్ష్మణ్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ గా ఈ ద్వయం ఎన్నో సినిమాలకు పని చేసారు. దాదాపు స్టార్ హీరోలందరి సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన మాస్టర్లు. సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జు, బాలయ్య, వెంకటేష్ నుంచి తర్వాత తరం స్టార్లతో కూడా పని చేసారు. ఇంకా ఎంతో మంది యంగ్ హీరోల సినిమాలకు పని చేసారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు.
`నా ఇల్లే నా స్వర్గం` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. అటుపై తమిళ, మలయాళం, కన్నడ చిత్రాలకు పని చేసారు. ఇద్దరు అన్నదమ్ములైనా...ఒక్కటే అన్నట్లు పనిచేసారు. తాజాగా రిలీజ్ `హరిహరవీరమల్లు` సినిమాకు, `కాంతార చాప్టర్ వన్` కు వాళ్లే పని చేసారు. త్వరలో రిలీజ్ అవుతున్న `అఖండ 2` చిత్రానికి కూడా ఫైట్స్ కంపోజ్ చేసారు. రాష్రస్థాయిలో పలు అవార్డులు..రివార్డులు అందుకున్నారు. ఆరేడేళ్ల క్రితం వరకూ పనిలో చాలా బిజీగా ఉండేవారు.
అయితే పరిశ్రమకు కొత్త కొరియోగ్రాఫర్లు రావడం తో సోదర ద్వయానికి మునుపటి కంటే అవకాశాలు తగ్గాయి అన్నది వాస్తవం. ఈ విషయాన్ని రామ్-లక్ష్మణ్ కూడా అంతే స్పోర్టివ్ గా తీసుకున్నారు. పరిశ్రమలో ఇప్పటి వరకూ తాము సంపాదించింది చాలని..చాలా మంది హీరోలకు పని చేసామని..ఇకపై కొత్త వారు రావాలని...వారు బిజీ అవ్వాలని స్పందించారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్-లక్ష్మణ్ తమ వారసుడిని కూడా యాక్షన్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నారు. అతడి పేరు రాహుల్.
ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల పరంగా ట్రెండ్ ఇలా ఉందని తమ కుమారుడు చెబుతాడని..వాటి ఆధారంగా తాము ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాం అన్నారు. త్వరలో రాహుల్ కూడా తమ మార్గంలోనే ప్రయాణాన్ని కొనసాగిస్తాడన్నారు. రాహుల్ ప్రతిభావంతుడిగా నిరూపించుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. చాలా మంది దర్శకులు స్టంట్ మాస్టర్ ల కోసం చెన్నై, ముంబై మాస్టర్ల మీద ఆధారప డుతున్నారు. తెలుగులో సరైన క్రియేటివ్ మాస్టర్లు లేకపోవడంతోనే ఇలా చేయాల్సి వస్తోంది. రాహుల్ లాంటి వారు సక్సస్ అయితే ఆ కొరత కొంత వరకూ తీరుతుంది.




బిగ్ బాస్ 9: ట్రోఫీ దగ్గరకొచ్చేసిన కంటెస్టెంట్
Loading..