బిగ్ బాస్ సీజన్ 9 లో11 కాదు 12 వారాలు ముగుస్తున్నా ఇప్పటివరకు ఎవరు విన్నర్ అవుతారనే విషయంలో ఆడియన్స్ లో పెద్దగా క్లారిటీ లేదు. 10 వారాలు ముగిసే సమయానికే బిగ్ బాస్ విన్నర్ ఎవరో అనేది డిసైడ్ అవుతుంది. కానీ ఈ సీజన్ లో సుమన్ శెట్టి, తనూజ, ఇమ్మాన్యుయేల్ మద్యన టైటిల్ పోరు ఉంటుంది అని భావించినా ఫైనల్ గా ఎవరు విన్నర్ మెటీరియల్ అనేది స్పష్టత రాలేదు.
ఈలోపు అనూహ్యంగా కామనర్ కళ్యాణ్ పడాల విన్నర్ రేస్ లోకి రావడం అందరికి షాకిచ్చింది. మొదటి మూడు వారాలు మూలన కూర్చున్న కళ్యాణ్ తర్వాత తనూజ సపోర్ట్ తో ఆటలో పడి తనకంటూ స్టాండ్ తీసుకుంటూ ఆడియన్స్ మనసు గెలుచుకున్నాడు. కళ్యాణ్-తనూజ ట్రాక్ ముద్దుగా ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కానీ ఇతర కంటెస్టెంట్స్ ముఖ్యంగా శ్రీజ తనూజ వల్ల కళ్యాణ్ గ్రాఫ్ తగ్గుతుంది అని తనూజ పై కక్ష పెంచుకుంది.
ఇక వైల్డ్ కార్డు ఎంట్రీలు రమ్య మోక్ష, అయేషా లు తనూజ ని కళ్యాణ్ విషయంలో టార్గెట్ కూడా చేశారు. మర్యాద మనీష్ అయితే ముద్దు ముద్దుగా ముద్దమందారం మాటలు చెబుతుంది అంటూ కళ్యాణ్ ని రెచ్చగొట్టాడు. అయినా కళ్యాణ్ తనూజ విషయంలో పాజిటివ్ గానే ఉన్నాడు. అంతేకాకుండా ఇతర కంటెస్టెంట్స్ విషయంలోనూ కళ్యాణ్ పడాల సరదాగా కలిసిపోవడం ఆడియన్స్ కు బాగా నచ్చింది.
నామినేషన్స్ లోకి వస్తే ఓటింగ్ లో దుమ్మురేపుతున్నాడు. ఇక రివ్యూవర్స్ కూడా కళ్యాణ్ ని ఎత్తేస్తున్నారు. కళ్యాణ్ బంగారు కొండ అతనే ఈ సీజన్ విన్నర్ అంటూ మాట్లాడుతున్నారు. మరి దీన్ని బట్టి కళ్యాణ్ పడాల బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ట్రోఫీ కి దగ్గరగా వచ్చినట్టే కనబడుతుంది. ఇదంతా అతన్ని హీరోని చేసేలాగే ఉంది వ్యవహారం.




ఆంధ్ర తాలూకా.. ఇద్దరికి కీలకమే
Loading..