`దృశ్యం` ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. మాలీవుడ్ తో పాటు తెలుగు, హిందీలోనూ రెండు భాగాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. దీంతో `దృశ్యం 3` ఎప్పుడంటూ తెలుగు అభిమానులంతా అడుగుతున్నారు. ఇప్పటికే మాలీవుడ్ లో `దృశ్యం 3` మొదలైంది. సగం షూటింగ్ కూడా పూర్తయింది. అలాగే బాలీవుడ్ లో కూడా పార్ట్ కి 3 సన్నాహాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో మొదలు పెడతామని అజయ్ దేవగణ్ అధికారికంగా వెల్లడించారు.
అయితే ఆ పార్ట్ 3కి దర్శకుడు ఎవరు? అన్నది ఇంత వరకూ క్లారిటీ లేదు. హిందీ వెర్షన్ మొదటి భాగానికి నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించగా, రెండవ భాగాన్ని అభిషేక్ పాఠక్ తెరకెక్కించాడు. రెండు భాగాలు కలిపి 500 కోట్లకు పగా వసూళ్లను సాధించాయి. దీంతో దర్శకుడి ఎంపిక విషయంలో అజయ్ దేవగణ్ కూడా నిర్ణయం తీసు కోలేకపోతున్నాడు. కానీ దర్శకత్వం బాధ్యతలు వీరిద్దరిలో ఎవరో ఒకరు తప్ప మరో కొత్త దర్శకుడిని తీసుకొచ్చే ఛాన్స్ అయితే లేదు.
వాస్తవానికి అక్టోబర్ లోనే పట్టాలెక్కించాలని ప్లాన్ చేసారు. కానీ కొన్ని కారణలతో సాధ్య పడలేదు. దీంతో వచ్చే నెల 12 న ముంబైలోని యశ్ రాజ్ ఫిలిం స్టూడియోలో మొదలు పెట్టాలని సర్వం సిద్దం చేస్తున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి తెలుగు `దృశ్యం 3` సంగతేంటి? అంటే ఎలాంటి ఉలికి పలుకు కనిపించడం లేదు. రెండు భాగాల్లోనూ విక్టరీ వెకంటేష్ నటించాడు. వాటికి మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు.
ఒకటి థియేటర్లో రిలీజ్ అవ్వగా మరోకటి కరోనా కారణంగా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసారు. కానీ `దృశ్యం 3` మాలీవుడ్, బాలీవుడ్లో ముస్తాబవుతోన్నా? టాలీవుడ్ లో మాత్రం ఎలాంటి అలజడి లేదు. దీంతో ఇక్కడ ఈ చిత్రాన్ని చేస్తారా? లేక మాలీవుడ్ వెర్షన్ రిలీజ్ తో సరి పెట్టుకుంటారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.




BB9 : ఇమ్మాన్యుయేల్ కి అదే ఎఫెక్ట్
Loading..