ఒకడిని భయపెట్టాలంటే `పోతావ్` అని వార్నింగ్ ఇస్తే చాలు. వాడిని మేం చూసుకుంటాం! అని లైట్ గా టీజ్ చేసినా చాలు. కానీ ఇప్పుడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ మనుషులు లేపేస్తాం అంటూ మాస్ వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. మాఫియా ఏ సినీ నటుడికో వార్నింగ్ ఇచ్చారని లైట్ తీస్కోవడానికి లేదు. బిష్ణోయ్ మనుషులం అని చెప్పుకుంటూ నేరుగా దేశ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఇద్దరికీ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
మోడీ-యోగి పోతారు..! అంటూ గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ మనుషులు వార్నింగ్ ఇవ్వడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బిహార్ ఎన్నికల ప్రచారంలో తలమునకలుగా ఉన్న సినీనటుడు రవికిషన్ కు కూడా వార్నింగ్ అందింది. ఈ ఎన్నికల్లో భాజపా తరపున ప్రచార బరిలో ఉన్న ఎంపీ రవికిషన్ని టార్గెట్ చేస్తూ బిష్ణోయ్ అనుచరులు మాస్ వార్నింగ్ ఇవ్వడం పెద్ద కలకలం రేపింది. రవికిషన్ని మేం చూసుకుంటాం! అంటూ వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఈ వార్నింగ్ ఇచ్చినది బిష్ణోయ్ అనుచరులేనా? ప్రత్యర్థి పార్టీ వ్యక్తులా అనేది ఇంకా తేలలేదు. ప్రస్తుతం మోదీ, యోగి పేర్లు ఉపయోగిస్తూ రవికిషన్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తులు గ్యాంగ్ స్టర్స్ లారెన్స్ బిష్ణోయ్ వర్గానికి చెందిన వ్యక్తులా కాదా? అనేది తేల్చేందుకు పోలీసుల రంగంలోకి దిగారు. విచారణలో నిజాలు నిగ్గు తేలాల్సి ఉంది. రేసుగుర్రం చిత్రంలో విలన్ గా అద్భుత నటనతో ఆకట్టుకున్న రవికిషన్ బిహార్ ఎన్నికల్లో భాజపా తరపున ప్రచారబరిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అతడిని టార్గెట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేసినది ఎవరై ఉంటారు? ఇది ప్రత్యర్థుల పన్నాగమా? బిష్ణోయ్ అనుచరులే వార్నింగ్ ఇచ్చారా? అనేది విచారణలో అధికారులు తేల్చాల్సి ఉంది.




BB9-ఈ వారం డబుల్ ఎలిమినేట్ ఎవరంటే.. 

Loading..