ఒకప్పుడు సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో పూజ హెగ్డే కి రష్మిక గట్టి పోటీ ఇచ్చింది. పూజ హెగ్డే టాప్ స్టార్స్ తో జతకడితే రష్మిక మెల్లగా యంగ్ హీరోలతో కలిసి టాప్ లోకి వచ్చేసింది. రష్మిక vs పూజ హెగ్డే కి మధ్యన హెల్దీ పోటీ నడిచింది. తర్వాత రష్మిక పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళింది.. అదే సమయంలో పూజ హెగ్డే టాప్ స్టార్స్ తో చేసిన సినిమాలన్నీ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి.
పూజ హెగ్డే తెలుగు, తమిళ, హిందీ మూడు భాషల్లోనూ వెనకపడిపోయింది. ఆ సమయంలోనే రష్మిక మందన్న హిందీలో టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. హిందీ, తెలుగు, తమిళ ఇలా ప్రతి భాషలోనూ రష్మిక సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఇన్నేళ్లు అంటే దాదాపుగా మూడేళ్ళ తర్వాత పూజ హెగ్డే కమ్ బ్యాక్ ఇచ్చింది.
ప్రస్తుతం సోషల్ మీడియా X లో రష్మిక మరియు పూజ హెగ్డే హ్యాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. రష్మిక మందన్న రీసెంట్ గా గర్ల్ ఫ్రెండ్ తో సక్సెస్ అందుకుంది. ఆ టైమ్ లోనే పూజ హెగ్డే తమిళనాట విజయ్ తో నటించిన జన నాయగన్ మూవీ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆ పాట లో విజయ్ తో పూజ హెగ్డే, మమిత బైజు లు కాలుకదపడమే కాదు పూజ అయితే చీరకట్టులో అద్దరగొట్టేసింది.
అందుకే పూజ హెగ్డే ని ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటే.. రష్మిక ఫ్యాన్స్ ఊరుకుంటారా.. గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ తో ఉన్న రష్మిక ని కూడా ట్రెండ్ చెయ్యడం చూసి చాలా రోజుల తర్వాత పూజ vs రష్మిక ఇలా కనిపించడం నిజంగా సూపర్ అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.




మోడీ-యోగి పోతారు.. గ్యాంగ్స్టర్ వార్నింగ్
Loading..