బిగ్ బాస్ సీజన్ 9 పూర్తి కావడానికి ఇంకా నెల రోజులే ఉంది. ఇప్పటికే రెండు నెలలు పూర్తవడం.. వారం వారం ఎవరో ఒకరు కొంతమంది స్ట్రాంగ్ అనుకున్నవారు హౌస్ ని వీడుతున్నారు. గత రెండు వారాలుగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన రమ్య మోక్ష, మాధురి ఎలిమినేట్ అవ్వగా ఈవారం నామైన్షన్స్ లో ఉన్నవారిలో ఎవరు హౌస్ ని వీడుతారో అనే విషయంలో ఆసక్తి ఏమి లేదు.
కారణం నామినేషన్స్ లో ఉన్నప్పుడు తనూజ, కళ్యాణ్ పోటాపోటీగా ఓట్లు కొల్లగొడుతున్నారు. ఇక సుమన్ శెట్టి, సంజన కూడా రోజుకొకళ్ళు బుల్లితెర ఆడియన్స్ నుంచి ఓట్లు రాబడుతున్నారు. భరణి కూడా నెమ్మదిగా స్ట్రాంగ్ గా మారుతున్నాడు. అయితే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్లిపోదామా అని రాము రాధోడ్, ఆటలో ఆడలేక మాటలు చెప్పుకుని బ్రతికే సాయి శ్రీనివాస్ లు ఆడియన్స్ దగ్గర నుంచి ఇంప్రెషన్ సంపాదించలేకపోతున్నారు.
వారు ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పటినుంచి వీక్ కంటెస్టెంట్స్ గానే ప్రొజెక్ట్ అవుతున్నారు. ఈ వారం రాము లేదా, సాయి ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని ఆడియన్స్ ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈవారం రాము సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు, అది శనివారం ఎపిసోడ్ లోనే నాగార్జున రాము దగ్గర క్లారిటీ తీసుకుని ఎలిమినేట్ చేసేసారు.
ఇక ఆదివారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా ఓటింగ్ లో వీక్ గా ఉన్న సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది.




అంతర్జాతీయ సినీ వేడుకల్లో రజనీకి సన్మానం

Loading..