ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చేసింది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన వాషి యో వాషి అనే ప్రత్యేక గీతాన్ని తాజాగా చిత్ర బృందం ఆవిష్కరించింది.
ఈ సర్ప్రైజ్ తో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఇప్పటికే వాషి యో వాషి అంటూ సామజిక మాధ్యమాలు మారుమోగిపోతున్నాయి. విడుదలైన క్షణాల్లోనే శ్రోతల మన్ననలు పొందుతూ.. ఈ గీతం సంచలనాలు సృష్టిస్తోంది. అభిమానులు దీనిని మెగా విందు అని అభివర్ణిస్తున్నారు. అలాగే, ఈ మరపురాని సర్ప్రైజ్ అందించిన ఓజీ చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు
సంగీత మాంత్రికుడు తమన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ఓజీ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన గీతాలన్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన వాషి యో వాషి గీతం వాటిని మించేలా, మరింత శక్తివంతంగా ఉంది. ఓజీలో పవన్ కళ్యాణ్ వింటేజ్ స్టైలిష్ ఆరాకు సరిగ్గా సరిపోయేలా ఈ గీతముంది. థమన్ అద్భుతమైన స్వరకల్పన, పవన్ కళ్యాణ్ అద్భుతమైన గాత్రం కలిసి వాషి యో వాషి ని మరుపురాని గీతంగా మలిచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను ఇది విందు భోజనంలా ఉంది.